వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం: అమలు చేయమన్న డిప్యూటీ సీఎం

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్(ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని ఏపీ సర్కారు తెలిపింది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ కు సంబంధించి ఏపీ అసెంబ్లీలో బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎన్పీఆర్-2020లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయన్నారు. అందువల్ల 2010 నాటి ఫార్మట్ ప్రకారమే ఎన్పీఆర్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎన్పీఆర్-2020లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు.

andhra pradesh assembly passes resolution against nrc.

మైనార్టీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్ జగన్ ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్ బాషా కొనియాడారు. ఇందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

2010, 2015లో ఎన్పీఆర్ నిర్వహించారని డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే, ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఎన్పీఆర్ ఫార్మట్లో కొన్ని అభ్యంతర అంశాలున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతోపాటు, ఇంకా మాతృ భాషకు సంబంధించిన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వ్యతిరేకంగా తీర్మానం చేశామని, దాని ఆధారంగానే ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరులైన భారత వీర సైనికులకు ఏపీ శాసనసభ సంతాపం తెలిపింది. రెండు నిమిషాలపాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.

English summary
andhra pradesh assembly passes resolution against nrc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X