ప్రశ్నపత్రాల లీకేజీపై చర్చకు వైసీపి పట్టు, అసెంబ్లీ వాయిదా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో వైసిపి సభ్యులు పట్టుపడడడంతో సభలో గందగగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు దఫాలు వాయిదా పడింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంపై వైసిపి సభ్యులు పట్టుబట్టడడంతో రెండో సారి కూడ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు.

సభ ప్రారంభం కాగానే పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయమై చర్చించాలని కోరుతూ వైసిపి సభ్యులు వాయిదా తీర్మాణం నోటీసు ఇచ్చారు.అయితే దీన్ని స్పీక్ర కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

ఈ విషయమై చర్చించాలని వైసీపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద తమ నిరసనను తెలిపారు.మంత్రులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

andhra pradesh assembly post poned for 10 minutes

మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను మంత్రివర్గం నుండి భర్తరప్ చేయాలని వైసీపి డిమాండ్ చేసింది.అయితే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు లేచి ఈ విషయమై చర్చించేందుకుగాను ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు.

మంగళవారం నాడు ముఖ్యమంత్రి ఈ విషయమై ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయమై ఆందోళన చేసిన వైసీపి సభ్యులు సభలో లేకుండా ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు.

ప్రశ్నపత్రాలు లీకేజీ కాలేదని మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆయన చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం కూడ చర్చకు సిద్దంగానే ఉందని ఆయన చెప్పారు.అయినా వైసీపి సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

రెండో దఫా సభ ప్రారంభమైన తర్వాత కూడ ఇదే విషయమై చర్చకు వైసీపి సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియానికి ఇరువైపులా ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. సభ కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడ్డారు.దీంతో రెండో దఫా కూడ స్పీకర్ సభను వాయిదా వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
andhra pradesh assembly post poned for 10 minutes.ysrcp mla's protest in assembly for discussion 10 th class question paper leakage issue.
Please Wait while comments are loading...