వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లకు ఆమోదం: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్చువల్‌గా క్యాబినెట్‌ నోట్‌ను ఉన్నతాధికారులు సర్క్యులేట్‌ చేయగా.. ఆ మేరకు మార్పులను మంత్రివర్గం ఆమోదించింది. కొత్త జిల్లాలపై సోమవారం తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల కేటాయింపుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోలు ఇవ్వనున్నారు.

ఏపీలో మొత్తం 26 జిల్లాలో 73 రెవెన్యూ డివిజన్లు

ఏపీలో మొత్తం 26 జిల్లాలో 73 రెవెన్యూ డివిజన్లు

ఏపీలో మెుత్తంగా 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. వాస్తవానికి ఉగాది రోజునుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.. కానీ వివిధ కారణాలతో ఏప్రిల్‌ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు ఆదేశాల ప్రకారం.. అధికారులు పనుల పర్యవేక్షణ వేగవంతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల్లో వసతుల కల్పన పనులు వేగిరం చేశారు. కాగా,రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాల్లో మండలాల సంఖ్య..

కొత్త జిల్లాల్లో మండలాల సంఖ్య..

శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

విజయనగరం జిల్లా.. 27 మండలాలు
పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు
విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు
అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు
కాకినాడ జిల్లా.. 21 మండలాలు
కోనసీమ జిల్లా.. 22 మండలాలు
తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు
పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు
ఏలూరు జిల్లా.. 28 మండలాలు
కృష్ణా జిల్లా.. 25 మండలాలు
ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు
గుంటూరు జిల్లా.. 18 మండలాలు
బాపట్ల జిల్లా.. 25 మండలాలు
పల్నాడు జిల్లా.. 28 మండలాలు
ప్రకాశం జిల్లా.. 38 మండలాలు
నెల్లూరు జిల్లా.. 38 మండలాలు
కర్నూలు జిల్లా.. 26 మండలాలు
నంద్యాల జిల్లా.. 29 మండలాలు
అనంతపురం జిల్లా.. 31 మండలాలు
శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
తిరుపతి జిల్లా.. 34 మండలాలు

English summary
Andhra Pradesh cabinet approval new districts and revenue divisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X