విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధాని: జూఎన్టీఆర్, కృష్ణంరాజుల ముందుచూపు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలో ఉంటుందని తెలియడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు ఈ పరిసరాల్లో భూములు కొన్నారు. ఇంకొందరు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు భూములను కొన్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితమే భూములు కొన్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారట. ఇంకొందరు ఇటీవల కొనుగోలు చేశారట. పలువురు ప్రముఖులకు చెందిన భూమిని గన్నవరం విమానాశ్రయం పరిధి విస్తృతి కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశముందట.

Andhra Pradesh capital: Big-shots capitalise fast

సినీ ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, రవితేజ, కృష్ణ, కృష్ణం రాజు, అశ్వినీ దత్ వంటి పలువురు ఇప్పటికే నాగార్జున విశ్వవిద్యాలయం, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారట! పలువురికి పదుల ఏకరాల భూములు ఉన్నాయట. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా భూములను కొనుగోలు చేశారట.

కాగా, గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. రాజధాని అక్కడే ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. మంత్రులు కూడా గుంటూరు - విజయవాడను పల్లె వేస్తున్నారు.

English summary
Several prominent personalities from the film world, industries and politics have bought property in the vicinity of Nagarjuna University, which is now being actively considered for setting up the new capital of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X