అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు... అందుకే రాజధాని మూడు ముక్కలాటగా మారింది.. నారాయణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం మూడు ముక్కలాటగా మారిందన్నారు సీపీఐ జాతీయి కార్యదర్శి నారాయణ, చంద్రబాబు రాజధాని నిర్మాణంలో విఫలమయ్యారని, అవసరమైన దానికంటే... ఎక్కువ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని అన్నారు. దీంతో జగన్ కూడ రాజధానిపై ఏం చేయాలతో తెలియక డైవర్షన్ స్కీంను అమలు చేస్తున్నారని అన్నారు.

సీఎం జగన్ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి ... లోకేష్ సీఎం జగన్ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి ... లోకేష్

 గుంటూరులోనే రాజధాని నిర్మాణం ఉండాలి.

గుంటూరులోనే రాజధాని నిర్మాణం ఉండాలి.

ఏపీ రాష్ట్రరాజధాని ఏర్పాటుపై పార్టీలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీపీఐ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ నారాయణ రాజధాని తరలింపు, అధికార వికేంద్రికరణ పై పార్టీ నిర్ణయాన్ని వెలువరించారు. కాగా రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలని కోరుకుంటుందని ,మద్రాస్ రాష్ట్రం విడీపోయినప్పుడు కూడ ఇదే విధానాన్ని స్పష్టం చేశామని చెప్పారు. ఇప్పుడు కూడ అదే నిర్ణయంతో ఉన్నామని తెలిపారు.

చంద్రబాబు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలని చూశారు

చంద్రబాబు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలని చూశారు

అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలు కోరుకుంటున్నట్టుగా రాజధానిని ఏర్పాటు చేసినా... దాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం రెండు లేదా మూడు వేల ఎకరాలు తీసుకుని పరిపాలనకు సంభంధించిన భవనాలు కట్టి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాని చంద్రబాబు మాత్రం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని తెలిపారు. దీంతో కేంద్రం కూడ ఇందుకోసం సహకరించలేదని అన్నారు. ఆయన అవలంబించిన విధానాలతోనే రాజధాని నిర్మాణం ఆలస్యం అయిందని వివరించారు.

భవిష్యత్‌లో విశాఖ రాజధాని

భవిష్యత్‌లో విశాఖ రాజధాని

ప్రభుత్వం మారడంతో చంద్రబాబు చేపట్టిన రాజధాని నిర్మాణం కొనసాగించడం వల్ల జగన్‌కు వచ్చే ప్రయోజనం లేకపోవడంతో జగన్ రాజధాని నిర్మాణాన్ని సుప్తచేతనావస్థలో ఉంచాలని భావించారని, అందుకే అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే... సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల అమరావతికి ఇబ్బంది కల్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక సీఎం జగన్ ఆలోచన అంతా భవిష్యత్‌లో విశాఖను రాజధాని ప్రాంతంగా తీర్చిదిద్ది, విజయవాడను డమ్మి చేయాలనే విధానాన్ని అవలంభిస్తున్నారని అన్నారు.

అసెంబ్లీ, సేక్రటేరియట్‌లు వేరు చేయడం వల్ల నష్టమే..

అసెంబ్లీ, సేక్రటేరియట్‌లు వేరు చేయడం వల్ల నష్టమే..

దేశంలోని పలు రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థలు వేరుగా ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో హైకోర్టులు ఉన్నాయని ,వాటివల్ల ఎలాంటీ ఇబ్బంది ఉండదని... కాని సీఎం జగన్ మాత్రం అసెంబ్లీని, సేక్రటేరియట్ వేరు చేయాలని చూస్తున్నారని.. దీని వల్ల అమరావతికి పూర్తిగా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. .దీంతో... రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజల్లో నమ్మకం కోల్పోతారని అన్నారు.

English summary
Andhra Pradesh capital has become like playing cards game, cpi Narayana said. and he opposed the capital divided into three parts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X