చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులో పొగలు: ఏం జరిగింది ?
సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో ఉన్నారు. తిరుపతి సమీపంలోని ఆవిలాల సమీపంలోకి కాన్వాయ్ చేరుకోగానే చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బస్సులో ఆకస్మికంగా పొగలు రావడంతో తెలుగు తమ్ముళ్లు హడలిపోయారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది చంద్రబాబును బస్సు దింపి వేరే వాహనంలో అక్కడి నుంచి తీసుకు వెళ్లారు.
సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో ఉన్నారు. తిరుపతి సమీపంలోని ఆవిలాల సమీపంలోకి కాన్వాయ్ చేరుకోగానే చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.

వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది చంద్రబాబును బస్సు నుంచి కిందకు దింపివేశారు. పక్కనే ఉన్న కారులో సీఎం చంద్రబాబు ఎక్కారు. బస్సులో పొగలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
తిరుమల వెంకన్న దయవలన మా నాయకుడు చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారని టీడీపీ నాయకులు చెప్పారు. బస్సులో పొగలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.

Click it and Unblock the Notifications