నేరస్తులను, రౌడీయిలను ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసిసట్టే, జగన్ పై బాబు సంచలనం
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకొన్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తమ పార్టీపై ఎదురుదాడి చేయడం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
అనకాపల్లి: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకొన్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తమ పార్టీపై ఎదురుదాడి చేయడం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన టిడిపి ఆత్మీయ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.వైఎస్ఆర్ సీపీ పై ఆయన విమర్శలు గుప్పించారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించిన జగన్ టిడిపిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.దొంగ లెక్కలు రాయడం, తప్పుడు పనులు చేయడం ఆయనకు అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు.నేరస్తును రౌడీలను ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టేనని ఆయన పరోక్షంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కల్గించే కాంగ్రెస్ పార్టీని సమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు బాబు. కాంగ్రెస్ పార్టీని సమాధి చేసి సిమెంట్ వేసి పూడ్చివేయాలని ఆయన కోరారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు కరెంట్ కోతలు ఉండేవన్నారు. ప్రజల కష్టాలను ఆ పార్టీ పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలు లేకుండా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు.అధికారులతో పాటు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించబోమన్నారు.
ఈ ఏడాది జూన్ రెండవ తేదినాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా పేదలకు ఇళ్ళను నిర్మించి ఇస్తామన్నారు. తాను దూరదృష్టితో పనిచేస్తున్నాని చెప్పారు.2022 నాటికి ఆంద్రప్రదేశ్ ను దేశంలోని మూడు రాష్ట్రాల్లో నిలబడతామన్నారు. 2029 నాటికి దేశంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టనున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications