కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత: హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడి: అదుపులో 20 మంది
బెంగళూరు: ఢిల్లీలోని జహంగీర్‌పురి, కర్ణాటకలోని హుబ్లీ తరహా ఉదంతాలు ఏపీలోనూ చోటు చేసుకున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్రపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటన తరువాత అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును చేపట్టారు. ఇప్పటిదాకా తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిసేపటికే హుబ్లీలోనూ అలాంటి ఉదంతమే సంభవించింది.
Andhra Pradesh | A clash broke out b/w members of two communities & stones were pelted from both the sides in Alur, Kurnool dist yesterday. Few persons injured in the incident. Police deployed at the incident spot; situation under control. Cases being registered: Police
— ANI (@ANI) April 17, 2022
హుబ్లీలో శనివారం అర్ధరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్‌పైనే దాడికి దిగాయి.. రాళ్ల వర్షాన్ని కురిపించాయి. అక్కడ పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటన అనంతరం నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.
AP | 15 people sustained minor injuries. 20 persons taken into custody based on videos & are being interrogated. Situation is peaceful; adequate civil & armed forces deployed: SP Kurnool on incident of stone-pelting b/w members of two communities during Hanuman Jayanti procession
— ANI (@ANI) April 17, 2022
ఇప్పుడు ఇలాంటి ఉదంతమే కర్నూలు జిల్లాలో సంభవించింది. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని ఆలూరు హోళగుంద, ఈర్లకట్టలో నిర్వహించిన శోభాయాత్రపై ఒక వర్గానికి చెందిన వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో స్థానికులు కొందరు గాయపడ్డారు. వారిలో ఓ బాలిక కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్ల దాడిలో 15 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెప్పారు.
While Ifatr was happening in a Mosque in Erla Katta in Hosagunda in Kurnool, a DJ procession was carried out through that street yesterday on the eve of Hanuman Jayanthi. People in the mosque objected, and stone pelting ensued from both sides. pic.twitter.com/CS0d47BWYl
— Gutta Rohith (@gutta_rohith) April 17, 2022

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా ఈ ఘటనకు కారణమైనట్లుగా అనుమానిస్తోన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వెల్లడించారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు విరించారు. సివిల్, సాయుధ బలగాలను మోహరింపజేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications