చంద్రబాబు గుడ్‌న్యూస్: ఒక్కొక్కరికి రూ.5 లక్షలు
చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీల అధినేతలు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్ లో కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన కాన్ఫరెన్స్ లో త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తెలుగు తమ్ముళ్లకు ఒకరకంగా ఇది శుభవార్తే.
కష్టపడినవారిని గుర్తుంచుకొని పదవులు
పార్టీకోసం కష్టపడినవారిని గుర్తుంచుకొని పదవులు కేటాయిస్తామన్నారు. కార్యకర్తలకు ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన సంగతిని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దోషులను వదిలిపెట్టేది లేదని, వైసీపీ నేతలకు నేరం చేయడం, దాన్నుంచి తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. పట్టాదారు పాసు పుస్తకాలను కూడా రాజముద్రతోనే ఇవ్వబోతున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 175 అన్న క్యాంటిన్లు ప్రారంభించిన విషయాన్ని తెలుగు తమ్ముళ్లతో గుర్తుచేసుకున్నారు.

ప్రజలు భయంతో బతికారు
తమ ఆస్తులు ఎప్పుడు కబ్జాకు గురవుతాయో అన్న భయంతో ప్రజలు బతికారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ భయం పోయిందని చంద్రబాబు అన్నారు. పెంచిన పింఛను రూ.4వేలు ప్రతినెలా ఒకటోతేదీనే అందిస్తున్నామని, ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు ప్రజలకు ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇసుక వల్ల సీనరేజ్, రవాణా, లోడింగ్ ఖర్చులు మాత్రమే అవుతాయన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టామని, నాణ్యమైన జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వరదల్లో మునిగిన వారికి రూ.25వేల సాయం అందజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25వేలు అందిస్తున్నట్లు, వరద బాధితులందరికీ స్వాంతన చేకూరేలా ఎన్డీయే ప్రభుత్వం పనిచేసిందన్నారు.












Click it and Unblock the Notifications