Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ఆడుదాం ఆంధ్ర’ లక్ష్యం ఇదేనంటూ సీఎం జగన్: పీవీ సింధు సహా క్రీడాకారుల భేటీ

విజయవాడ: 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 'ఆడుదాం ఆంధ్రా' అనే క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం జాతీయ అకాడమీలు, సీఎస్కే, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబ్బాడి వంటి ఫ్రాంచైజీలను అట్టడుగు స్థాయిలో ప్రతిభను వెలికితీసేందుకు, వృత్తిపరంగా వారికి మార్గదర్శకత్వం చేస్తుంది. తాజా సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులతోపాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

andhra pradesh cm jagan held review meeting on aadudam andhra program

క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఇలాంటి కార్యక్రమం ఏపీలో జరగలేదన్నారు సీఎం జగన్. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాన్ని అయినా ఒక బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేస్తూ చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరూ చేయని కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ప్రమోట్ చేయాలన్నారు.

ఆడుదాం ఆంధ్రాలో ప్రధానంగా 5 క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో ఆటలను ప్రమోట్ చేయాలన్నారు సీఎం జగన్. గ్రామస్థాయి నుంచి వీటిని ప్రమోట్ చేయాలన్నదే మన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించి.. వీటిని ముగించడంతోపాటు మనం ఐడెంటిఫై చేసిన ప్రతిభగల క్రీడాకారులను మరలా ప్రోత్సహించే వరకు కూడా అడుగులు పడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 3 కిలోమీటర్ల మారథాన్ వంటి కార్యక్రమాలతో ఉత్సాహంగా కొనసాగాలన్నారు.

ప్రతి సంవత్సరం గ్రామస్థాయి నుంచి మనం క్రీడల్లో మట్టిలో రత్నాలు వంటి ప్రతిభావంతులను వెదికిపట్టుకోగలిగితే.. పీవీ సింధు, జ్యోతి సురేఖ, రాయుడు, శ్రీకాంత్, సాకేత్ వంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుతామన్నారు సీఎం జగన్. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు మన ప్రతిభను చూపించగలుగుతామన్నారు.

andhra pradesh cm jagan held review meeting on aadudam andhra program

డిసెంబర్ 26 నుంచి కార్యక్రమం మొదలై.. 47 రోజులపాటు ఫిబ్రవరి 10 వరకు సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఓపీని సమగ్రంగా మరొక్కసారి పరిశీలించాలి. అదే విధంగా దీని కోసం 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9043 క్రీడా మైదనాలను గుర్తించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+