జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రస్తుతం సోషల్ మీడియా విజృంభిస్తున్న నేటి కాలంలో యువతను ఆకట్టుకునే కంటెంట్ తో జెన్ జెడ్ వ్లాగర్ స్వాతి రోజా చాలా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. జెన్ జెడ్ వాయిస్ గా డిజిటల్ ప్రపంచంలో స్వాతి రోజా తనదైన ముద్ర వేస్తున్నారు. దేశవ్యాప్తంగా బైక్ పైన ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ను కలిసిన స్వాతి రోజా
ఈ క్రమంలో తాజాగా నేడు జెన్ జడ్ వ్లాగర్ స్వాతి రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆమె సాహస యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుతున్న స్వాతి రోజాను అభినందించారు. ఆమె చేసే భవిష్యత్తు యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan congratulated Gen Z vlogger Swati Rojha

ఆలయాలలో స్వాతి రోజాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్
దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమెకు కొద్ది వారాల క్రితం శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తగా, విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెకు ఆలయాలలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు. శ్రీశైలం ఆలయం మాత్రమే కాక తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలలో ఆమెకు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయించారు.

స్వాతి రోజా సాహసయాత్రను మెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దీంతో నేడు దుర్గమ్మ దర్శనం అనంతరం జెన్ జెడ్ వ్లాగర్ స్వాతి రోజా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన చూపించిన శ్రద్ధకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలను ఆమె ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. బైక్ రైడ్ చేస్తూ స్వాతి రోజా చేసే సాహస యాత్రను గురించి మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తనకు ఉన్న బైక్ రైడింగ్, బైక్ లపై ఉన్న ఆసక్తిని ఈ సందర్భంగా పంచుకున్నారు.

యూట్యూబ్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రజలకు తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్
ఇక స్వాతి రోజా, కొత్త ప్రదేశాలను సందర్శించటం, అందమైన రోడ్ల గుండా ప్రయాణించడం, నా సాహసాలను మీ అందరితో పంచుకోవడం ఇష్టపడే బైక్ వ్లాగర్. ఆమె తన ప్రతీ ప్రయాణాన్ని యూ ట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+