మీడియాకు మూడువేల కిలోమీటర్ల దూరంలో వైసీపీ, భయమా?, భయంతో కూడుకున్న!!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి చెక్ పడింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ప్రకటించారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మంగళం పాడేశారు. ఇప్పటికే మంత్రులు పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోవడంతో ఇక సీఎం జగన్ కూడా ఈరోజు, రోపే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చెయ్యనున్నారని తెలిసింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అనే డైలాగ్ చెప్పి ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి నిన్నటి వరకు వైసీపీలోని కొందరు నాయకులు ఎంత రెచ్చిపోయేరో అందరికి తెలిసిందే. వైసీపీలో కొందరు చేసిన పనికి ఆ పార్టీ ఈరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నోటికి అడ్డుఅదుపులేకుండా మాట్లాడిన నేతలను సీఎం జగన్ వెనుకేసుకురావడం, జగన్ దగ్గర మార్కులు కోట్టేయాలని వైసీపీ నాయకులు ఇంతకాలం ఇంకా ఎక్కువ హంగామా చెయ్యడంతో ఆ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

ఇసుక క్వారీలు, మైనింగ్, కాంట్రాక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గతంలో కాంట్రాక్టు పనులు చేసిన చాలా మందికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి బిల్లుకూడా చెయ్యలేదు. చాలా మంది చిన్నాచితక కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కాంట్రాక్టర్లు, వ్యాపారులు వైసీపీ కండువాలు కప్పుకుని వారు చెప్పినట్లు వినే పరిస్థితి ఎదురైయ్యింది.
పదేపదే మీడియా సమావేశాలు పెట్టి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైసీపీ నాయకులు మంగళవారం ఉదయం నుంచి మాయం అయిపోయారు. మీడియా సమావేశం అంటే మూడువేల కిలోమీటర్ల దూరం వెళ్లిపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మీద నోరుపారేసుకున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు వణుకు మొదలైయ్యింది.
టీడీపీ, జనసేన నాయకులను బూతులు తిట్టిన వైసీపీ నాయకులను ఇప్పుడు జగన్ వచ్చి కాపాడుతాడా ?, ఎవరు వచ్చి కాపాడుతారో చూస్తాం అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నోరుపారేసుకున్న మాజీ మంత్రులను ఇప్పుడు ఆ దేవుడు తప్పా ఇంకెవ్వరు కాపాడటానికి లేరని ప్రజలు అంటున్నారు. వైసీపీ నాయకులను మాట్లాడించడానికి మీడియా ప్రయత్నిస్తే ఒక్క నాయకుడు కూడా అడ్రస్ లేకుండాపోయాడు. చేసిన పాపం ఊరికేపోదు అనే సామెత ఇప్పుడు కొందరు వైసీపీ నాయకులకు వర్థిస్తుందని సామాన్య ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications