ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర చిహ్నాలు ఖరారు...ఉత్తర్వులు జారీ
Recommended Video

అమరావతి: రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో ఈ మేరకు వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు.
రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టు గా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వును ఖరారు చేశారు. తాజా చిహ్నాలు జూన్ ఆరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ చిహ్నాలు జూన్ 6 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే కొనసాగించారు. అయితే విభజన అనంతరం రాష్ట్ర భౌగోళిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నూతన రాష్ట్ర చిహ్నాలను ప్రకటించింది ఎపి ప్రభుత్వం.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, ప్రస్తుతం దాని స్థానంలో రామచిలుకను నిర్ణయించారు. అలాగే రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. అయితే, ప్రభుత్వం తాజా ప్రకటించిన ఈ చిహ్నాలు జూన్ 6 వ తేదీ నుంచి మాత్రమే అధికారికంగా అమల్లోకి రానుండటం గమనార్హం.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications