వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధి వేగం: ఏపీలో పెమాండు అమలుకు మలేషియాతో ఒప్పందం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రజలకు పాలనా ఫలితాలు అందించటంలో, వేగవంతమైన అభివృద్ధిని సాధించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మలేషియా ప్రధానమంత్రి అజమాయిషీలో ఉండే ‘పెమాండు' (పెర్ఫామెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్)తో ఒప్పందం కుదుర్చుకుంది.

విజయవాడ నగరంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మలేషియా ‘పెమాండు' సీఈఓ ఇడ్రిస్ జలా సమక్షంలో ఆంధ్రప్రదేశ్, మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా, భారీ లక్ష్యాలు సాధించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మలేషియా మంత్రి, ‘పెమాండు' సిఈఓ ఇద్రిజ్ జలా మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు ముందుగా తమ దేశంలో నాణ్యమైన విద్యను అందించటమే ధ్యేయంగా పెట్టుకున్నామని, అవినీతి రహిత పారదర్శక పరిపాలనకు బాట వేశామని ఇద్రిస్ జలా తెలిపారు.

తాము చేపట్టిన సంస్కరణలు దేశ దశ, దిశను ఎలా మార్చాయో వివరించారు. తమ దేశం మూడు దశాబ్దల కింద బొటాబొటీ ఆదాయం ఉన్న దేశంగా ఉండేదని, తాము చేపట్టిన పాలనా సంస్కరణలు దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నాయని కలెక్టర్లకు వివరించారు. పేదరికం రూపుమాపటానికి విద్య ఒక బలమైన సాధనమని చెప్పారు.

తాను ఒక అట్టడుగు గిరిజన కుటుంబం నుంచి వచ్చానని, ప్రధానమంత్రి కేబినెట్‌లో స్థానం పొందానని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే వేగవంతంగా ఫలితాలు సాధించవచ్చని చెప్పటానికి తన జీవితమే చక్కని ఉదాహరణ అని చెప్పారు. ‘డిసిప్లిన్ ఆఫ్ యాక్షన్' కావాలని తెలిపారు. నేరాలను అరికట్టడం, జీవన ప్రమాణాలను పెంచటం, గ్రామీణాభివృద్ధి, విద్య, తదితర రంగాలకు తాము ‘పెమాండు' కింద ప్రాధాన్యతనిచ్చి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచామని వివరించారు.

పాలకులు, సివిల్ సర్వెంట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలసి పనిచేస్తేనే వేగవంతంగా లక్ష్యాలు సాధిస్తామని వివరించారు. ల్యాబ్ టెక్నాలజీ అనేది ప్రజలకు సేవలు అందించటానికి ఉపయోగపడుతుందని, ఇది 8 అంచెల విధానమని జలా తెలిపారు. విశ్లేణాత్మక ఫలితాల ద్వారా సేవలను నిర్ధారిస్తామని, సేవలు ప్రాథమికంగా ఎవరికి అవసరమో గుర్తించి వారికి అందిస్తామని, 30 శాతం సిఫార్సుల ఆధారంగా, మరో 30 శాతం రిఫైన్ చేస్తామని, 40 శాతం గతంలో ఎవరూ ఆలోచించి ఉండని పరిష్కారాలను అందిస్తామన్నారు.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

ప్రభుత్వ పాలనా సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

ప్రజలకు పాలనా ఫలితాలు అందించటంలో, వేగవంతమైన అభివృద్ధిని సాధించటానికి ఏపి ప్రభుత్వం మలేషియా ప్రధానమంత్రి అజమాయిషీలో ఉండే ‘పెమాండు' (పెర్ఫామెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్)తో ఒప్పందం కుదుర్చుకుంది.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

విజయవాడ నగరంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మలేషియా ‘పెమాండు' సీఈఓ ఇడ్రిస్ జలా సమక్షంలో ఆంధ్రప్రదేశ్, మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా, భారీ లక్ష్యాలు సాధించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

పెమాండుతో ఒప్పందం చేసుకున్న తొలిరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవడం సంతోషంగా ఉందన్నారు.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి దేశంలో తొలిరాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా నిలపాలన్న లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక మార్పులకు పెమాండు సహకరిస్తుందని పేర్కొన్నారు.

మలేషియాతో ఒప్పందం

మలేషియాతో ఒప్పందం

2020 నాటికి మలేషియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు వారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తున్నారో అదే స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. సమ్మిళిత అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సంపద సృష్టే తమ లక్ష్యాలని పునరుద్ఘాటించారు.

పెమాండును తాము ప్రారంభించినప్పుడు వృద్ధి 3.5 శాతంగా ఉండేదని, తర్వాత 5 శాతానికి చేరిందన్నారు. ద్రవ్య లోటును బాగా తగ్గించటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలకు డబ్బు వెచ్చిస్తున్నామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశామని, మలేషియా వాసులు సగటు జీతం 6 శాతంకు పెరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం 2010లో గవర్నమెంట్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం (జిటిపి), ఎకనమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం ప్రారంభించామని తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఒకటిగా మలేషియాను నిలపాలన్నది తమ లక్ష్యమని మలేషియా మంత్రి తెలిపారు. విద్యా రంగంలో మేం న్యుమరికల్, డిజిటల్ లిటరసీని సాధించామన్నారు. ప్రీస్కూల్ తరగతుల్లో చేర్చాల్సిన పిల్లలు ఇంకా 54 వేల మంది ఉన్నారన్నారు. పట్టణ రవాణా వ్యవస్థను ప్రస్తుతం 12 శాతం ఉపయోగించుకుంటున్నామన్నారు. ఇది 15 శాతానికి చేరాలన్నది లక్ష్యమన్నారు.

2.4 మిలియన్ల ప్రయాణికులను అదనంగా చేరవేసే సామర్థ్యం వారి లైట్ రైల్ వ్యవస్థకు ఉందన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. 775 కిమీ గ్రామీణ రోడ్లు నిర్మించామన్నారు. గ్రామాల్లో 35 వేల ఇళ్లకు శుద్ధి చేసిన జలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. సంస్కరణలతో 6 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు.

English summary
Andhra Pradesh Government today signed an MoU with Performance Management and Delivery Unit (PEMANDU) under Malaysian Prime Minister's Department for cooperation in areas of performance management and monitoring of public programmes, education and retail services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X