రూ.2వేల కోట్లకు అమరావతి బాండ్లు... ఉత్తర్వులు విడుదల... అందుకేనా...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర నుండి నిధులు వచ్చేది లేదని తేలిపోవడంతో సిఆర్డిఎ నిధుల సమీకరణకు సొంత ప్రయత్నాలు ప్రారంభించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2వేల కోట్ల రూపాయలను వివిధ బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటేనే నిధుల సేకరణ సులభమవుతుందని యోచించిన సిఆర్డిఏ ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించుకొంది.

దీంతో ఈ బాండ్లకు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలియజేసింది.ఆ బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థనకు అనుగుణంగా ఉత్తర్వులు సైతం విడుదలయ్యాయి. దేశీయ, మసాలా తదితర బాండ్ల రూపంలో సిఆర్డిఏ ఈ మొత్తాన్నిసమీకరించి రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.

అసలు బాండ్లు ఎందుకు...జారీ చేస్తారు...

అసలు బాండ్లు ఎందుకు...జారీ చేస్తారు...

మనం అప్పుడప్పుడు ప్ర‌భుత్వం ఫ‌లానా బాండ్ల‌ను జారీచేస్తుంద‌నే ప్ర‌క‌ట‌న‌లు వింటుంటాం...అలాగే కార్పోరేట్ సంస్థలు కూడా ఇలా త‌మ‌ బాండ్ల‌ను జారీ చేస్తుంటాయి...అయితే ఎందుకు వీటిని జారీ చేస్తార‌నే విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం...బాండ్లు ఒక స్థిర ఆదాయ పెట్టుబడి వ‌ర్గంలోకి వ‌స్తాయి. ఒక సంస్థ తమ పరిధి, అభివృద్ది లేదా కార్యకలాపాల విస్త‌రణ కోసం అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డిని స‌మీక‌రించేందుకు షేర్ల‌ను జారీ చేస్తుంది. ఇలా సేక‌రించిన‌ మొత్తాన్ని ప్ర‌భుత్వం లేదా స‌ంస్థ‌లు రుణం రూపంలో...అంటే డెట్ రూపంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి సొమ్మును స‌మీక‌రించడం జరుగుతుంది. వీటినే బాండ్లు లేదా డిబెంచ‌ర్లు అంటారు. ఈ బాండ్ల‌ను కొనుగోలు చేసిన పెట్టుబ‌డిదారులు ఆయా సంస్థలకు రుణ‌దాత‌లు అవుతారు.

ఇలా సేకరిచంచిన సొమ్మును...అభివృద్ది కోసం...

ఇలా సేకరిచంచిన సొమ్మును...అభివృద్ది కోసం...

ఇలా బాండ్ల జారీ చెయ్యడం ద్వారా సేకరించిన రుణాన్ని ఆయా సంస్థ‌లు త‌మ తమ సంస్థల అభివృద్ధి ప‌నుల‌కు వినియోగించుకుంటాయి. ప్ర‌భుత్వ బాండ్ల‌ను ప్ర‌జ‌ల‌కు జారీచేయ‌డం ద్వారా స‌మీక‌రించే సొమ్మును ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు, ఆర్థిక లోటును భ‌ర్తీ చేసుకునేందుకు, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ‌కు వినియోగిస్తారు. అదే కార్పొరేట్‌ సంస్థలైతే త‌మ వ్యాపార వృద్ధికి వినియోగించుకుంటాయి.

మరో పధకానికి ప్రభుత్వం గ్యారెంటీ...మరిన్ని కీలక నిర్ణయాలు...

మరో పధకానికి ప్రభుత్వం గ్యారెంటీ...మరిన్ని కీలక నిర్ణయాలు...

అమరావతి బాండ్లతో పాటు రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ లే అవుట్లలోని 5 జోన్లలో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో రూ.10,732 కోట్ల విలువతో మౌలిక వసతులను అభివృద్ధి పరిచేందుకు కూడా ఎపి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అలాగే రాజధాని పాలనా నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం మొత్తం రూ.3,306.80 కోట్లతో నిర్మిస్తున్న 3,840 ఫ్లాట్లతో కూడిన గవర్నమెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌కూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ కాంప్లెక్స్‌ను నిర్మించే బాధ్యతను సీఆర్డీయేకు అప్పగించేందుకూ ఎపి ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi: CRDA will soon issue Amaravathi bonds named "Desiya" "Mashala"to raise funds for development of the new state capital. The AP state government on Thursday agreed to remain a guarantee for these bonds.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి