ఏపీలో మరో పథకం.. ఆగస్టు 15 నుంచి ఇంటివద్దకే

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ముందుగా గత నెల నుంచే పెంచిన పింఛన్ ను అందజేస్తున్నారు. దీని తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నారు. అనంతరం మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.

వచ్చే నెల 15 నుంచి ఇంటింటికీ వైద్య సిబ్బంది
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా ఈ పథకాన్ని అమలు చేస్తుననారు. రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల వైద్యసేవల కోసం బడ్జెట్ లో రూ.680 కోట్లు కేటాయించారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మూడు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.

andhra pradesh government will implement new health scheme from august 15th

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య
ఏపీలో కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం దీనికి ప్రత్యేక చికిత్స అందించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో తొలి దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు. అందుకే క్యాన్సర్ రోగాన్ని తొలిదశలోనే గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల్లో పాజిటివ్ ఉంటే వెంటనే వారిని గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. అక్కడ పూర్తిస్థాయి చికిత్స అందుతుంది. ఈ పథకంలో భాగంగా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కృష్ణబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+