ఏపీలో కొత్త ఇసుక పాలసీ: సినీ ఫక్కీలో తిరుపతిలో కారులోని 30 లక్షలు చోరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రి వర్గం తీసుకుంది. ఈ సమావేశంలో నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఫిబ్రవరి 1 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 సేవలు ప్రారంభించనున్నారు. ఈ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి 1వ తేదీన ప్రారంభిస్తారని తెలిసింది.
పార్క్ చేసిన కారులోంచి రూ. 30 లక్షలు చోరీ
తిరుపలతిలో పార్క్ చేసిన కారులోంచి రూ. 30 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, తిరుమలలోని సారంగి హోటల్‌కు చెందిన మోహన్ డబ్బు తీసుకుని తిరుపతిలోని శ్రీదీవి కాంప్లెక్స్‌కు పని మీద వచ్చాడు.
తనతో పాటు అసిస్టెంట్ భాను ప్రకాశ్ కూడా వచ్చాడు. అసిస్టెంట్‌ను కారులోనే ఉంచి మోహన్ కాంప్లెక్స్‌లోకి షాపింగ్‌కు వెళ్లాడు. ఇంతలో ఓ వ్యక్తి భాను ప్రకాశ్ వద్దకు వచ్చి కింద కర్ఛీప్ పడిపోయిందని, అందులో పది రూపాయలు ఉన్నాయని చెప్పాడు.
ఇది నమ్మిన భాను ప్రకాశ్ కిందికి దిగి చూస్తుండగానే కారులో ఉన్న రూ. 30 లక్షలను ఆ వ్యక్తి తీసుకుని పారిపోయాడు. వెంటనే జరిగిన ఘటనపై సారంగి హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications