ఏపీలో ప్రభుత్వం 'ఉగాది' వేడుకను నిర్వహిస్తుందా లేదా? ఉంటే ఎక్కడ?

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది వేడుక ఉగాది. ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉగాది వేడుకను హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఘనంగా అప్పటి ప్రభుత్వాలు నిర్వహించేవి.

అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన మొదటి ఉగాది వేడుకను నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలోని వైకుంఠపురం వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగాయి. అయితే ఉగాది వేడుకల కోసం ఏర్పాటు చేయడం కోసం అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఉగాది వేడుకలను ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. కొందరు తుళ్లారులోని, మరికొందరు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం అయితే బాగుంటుందని సూచిస్తున్నారు.

Andhra Pradesh Govt Ugadi celebrations where it take place

ఏప్రిల్ 8న ఉగాది పండుగ. పండుగకు ఇంకా పది రోజులు కూడా లేవు. వేడుకకు ఏర్పాట్లు చేసి, అందరికీ ఆహ్వానాలు పంపాలంటే, కనీసం వారం రోజులు పడుతుంది. ఇప్పటికీ పండగ వేదికపై అధికారులు ఓ నిర్ణయం తీసుకోకపోవడంతో, అధికారికంగా వేడుకలు ఉంటాయా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇది ఇలా ఉంటే ఉగాది వేడుకలు ఎక్కడ చేయాలన్న విషయమై నేడు ప్రకటన వెలువడుతుందని ఏపీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఈసారి షడ్రషోపేతమైన విందు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఉగాది వేడుకను ఎక్కడ నిర్వహించున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+