పరకామణి కేసు : టీటీడీకి, సీఐడీ హైకోర్టు కీలక ఆదేశాలు
టీటీడీ పరకామణిలో కానుకల లెక్కింపు వ్యవహారంపై జరుగుతున్న కేసు విచారణలో ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యత కలిగిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ, ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో లెక్కింపు విధానం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో జరిగిన చోరి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం, నిందితులతో కొందరు పోలీసు సిబ్బంది చేతులు కలిపినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి అధికారులపై కేవలం శాఖాపరమైన విచారణకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో బయటపడిన అంశాల ఆధారంగా విచారణను మరింత విస్తరించవచ్చని తెలిపింది.
పరకామణిలో కానుకల లెక్కింపుకు అనుసరిస్తున్న పద్ధతులపై కూడా హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికీ పాత విధానాలనే కొనసాగిస్తున్నారని... లెక్కింపుకు ఇప్పటికీ లుంగీలతో వచ్చే పద్ధతినే కొనసాగిస్తుండటంపై అనుమానాలు లేవనెత్తింది. ప్రత్యామ్నాయ పద్ధతులు ఎందుకు అమలు చేయలేదని టీటీడీని నిలదీసింది. కానుకల లెక్కింపులో ఉపయోగించే టేబుళ్ల ఏర్పాటు, భద్రతా ప్రమాణాలపై నివేదికలో స్పష్టత లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

ఈ అంశాలపై టీటీడీ ఈవోతో చర్చించి సమగ్ర సమాచారం అందిస్తామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పరకామణి వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలితే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేసును తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
పరకామణిలో రెండేళ్ల క్రితం యూఎస్ డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవి కుమార్ దొరికిపోయాడు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ తాజాగా తాడిపత్రిలో రైలు పట్టాల పక్కన శవమై దొరికారు. ఈ నేపథ్యంలో పరకామణి కేసులో లోతైన దర్యాప్తు అవసరమని గతంలోనే సీఐడీ, ఏసీబీ హైకోర్టుకు తెలిపాయి. అదే సమయంలో పరకామణి చోరీ కేసులో నిందితుడిగా ఉండి టీటీడీకి ఆస్తులు రాసిచ్చి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న రవి కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. టీటీడీకే 100 కోట్ల ఆస్తులు రాసిచ్చిన రవికుమార్ ఆదాయ వనరులపై దర్యాప్తు జరపాలని ఇప్పటికే ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏసీబీ ముందు ఈ దర్యాప్తు కొనసాగించనుంది. అనంతరం పరకామణి కేసు రాజీ చేయించిన వైసీపీ నేతలపై సీఐడీ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications