వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.700 కోట్లతో దేశంలోనే తొలిసారి చంద్రబాబు 'అద్భుతం' (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: గోదావరి జలాలు కృష్ణా జిల్లాలోకి లాంఛనంగా బుధవారం ప్రవేశించాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీరు వచ్చేలోపు తాడిపూడి ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడికాలువకు నీరు విడుదల చేశారు. ఈ నెల 4వ తేదీన తాడిపూడి నుంచి 600 క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ విడుదల చేసింది.

మంగళవారం మధ్యాహ్నానికి వస్తాయనుకున్నప్పటికీ అర్ధరాత్రికి చేరాయి. దీంతో కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం పల్లెర్లమూడిలోకి బుధవారం లాంఛనంగా గోదావరి ప్రవేశించింది.

గోదావరి జలాలకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఏలూరు ఎంపీ మాగండి బాబు, దెందులురు, గన్నవరం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, వల్లభనేని వంశీలు పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి రైతులు వచ్చి హారతులు ఇచ్చి, పసుపు, కుంకుమ, పూలు చల్లి స్వాగతించారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు కొరత తీర్చేందుకు ప్రభుత్వం దేశంలోనే ప్రప్రథమంగా గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీతో పూర్తవుతుందని మంత్రి దేవినేని చెప్పారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి తరలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పది గంటల యాభై అయిదు నిమిషాలకు పశ్చిమ గోదావరి - కృష్ణా జిల్లాల సరిహద్దు 119వ కిలోమీటరులోని పల్లెర్లమూడి గ్రామం వద్ద గోదావరి జలాలకు మంత్రి సహా ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి జలాలను కృష్ణా జిల్లాలోకి విడుదల చేశారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కాలువలోకి విడుదల చేసిన 500 క్యూసెక్కుల గోదావరి నీటిని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జలాలలతో అనుసంధానం చేయనున్నారు.

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

పల్లెర్లమూడి నుంచి సీతాపురం, వేలేరు, రేమల్లె, వీరవల్లి, రంగన్నగూడెం, సూరవరం, బండారుగూడెం, బలిపర్రు, తెంపల్లి, వీరపనేనిగూడె, కొత్తగూడెం, చిక్కవరం, గొల్లనపల్లి, గోపువారిగూడెం, సూరంపల్లి, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి మీదుగా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ చానల్ ద్వారా కృష్ణానదిలోకి గోదావరి జలాలను కలపనున్నారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

పల్లెర్లమూడి వద్ద గోదావరి నీటికి హారతులు ఇచ్చి పూజలు నిర్వహించిన మంత్రి దేవినేని మాట్లాడుతూ... చంద్రబాబు మహా సంకల్ప ఫలితమే ఈ నదుల అనసంధానం అని చెప్పారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

దేశంలోనే తొలిసారిగా రెండు నదీ జలాలను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

2006లో పోలవరం కాలువకు భూములు ఇవ్వడానికి వెనుకాడి కోర్టుకు వెళ్లిన రైతాంగాన్ని సమాధానపర్చి కేసులు మాఫీ చేయించి 700 కోట్లు ఖర్చు చేసి అతికొద్ది కాలంలోనే కాలువలు పూర్తి చేసిన ఘతన తమ ప్రభుత్వానిదే అన్నారు.

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అయిదు రోజుల తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణమ్మలో గోదావరి జలాలను అనుసంధానం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని దేవినేని చెప్పారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ.. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానంతో రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తొలగిపోయాని చెప్పారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు నదుల అనుసంధానం అతి స్వల్పకాలంలో పూర్తి చేశారన్నారు.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అంతకుముందు సీతారామపురం వద్ద నుంచి పోలవరం కాలువ వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలు మేళతాలాలతో దేవినేనికి ఘన స్వాగతం పలికారు.

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

కాగా, పట్టిసీమలో మొదటి పంపును త్వరలో ప్రారంభించాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు. పట్టిసీమలో బిగించవలసిన మోటార్లు బుధవారం బోపాల్‌లో బయలుదేరాయి.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

రోడ్డు మార్గం గుండా వస్తున్న ఈ మోటార్లు శుక్రవారం అర్ధరాత్రికి లేదా శనివారం ఉదయానికి పట్టిసీమ చేరుకుంటాయి.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

గోదావరి - కృష్ణా నదులు అనుసంధానమయ్యే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

అద్భుత దృశ్యం - కృష్ణాలో గోదారి తల్లి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభలో పాల్గొంటారు. సభ కోసం అయిదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 15న లేదా 16న పట్టిసీమ వద్ద చంద్రబాబు మొదటి పంపును ప్రారంభిస్తారు.

English summary
"It is a historic moment. Godavari and Krishna rivers are interlinked now,’’ AP Irrigation Minister Devineni Umamaheshwara Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X