Polavaram: గడువులోగా ప్రాజెక్టు పూర్తి: రాక్‌ఫిల్ డ్యామ్ మూడోదశ పనులు: మంత్రి అనిల్ సందర్శన

అమరావతి: జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-3 పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద మంత్రి ప్రత్యేక పూజలను చేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోలవరం శాసనసభ్యుడు తెర్లం బాలరాజు, ఇతర అధికారులు ఉన్నారు.

పోలవరంలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్యాప్-3 పనులకు ఈ ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు గ్రావిటీ ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందున.. నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సి ఉంటుందని ఆయన అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: Irrigation minister Anil Kumar Yadav visits Polavaram Project on Sunday

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వైఎస్ జగన్ కొద్ది రోజుల కిందటే సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గడువులోగా ప్రాజెక్టు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఒక్క రోజు కూడా పనులను నిలిపివేయడానికి వీల్లేదని ఆదేశించారు. జల వనరుల శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రులు తరచూ ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. ఈ నేపథ్యంలో- మంత్రి అనిల్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే తెర్లం బాలరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌, ఇతర అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.

Andhra Pradesh: Irrigation minister Anil Kumar Yadav visits Polavaram Project on Sunday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+