జగన్ ను శిశుపాలుడితో పోల్చిన అచ్చెన్నాయుడు, నూరు తప్పులు
మాజీ సీఎం జగన్ తాను శనివారం తిరుమలకు వెలుతానని, వైసీపీ కార్యకర్తలు అందరూ వారివారి ఊర్లలోని దేవాలయాల్లో పూజలు చెయ్యాలని పిలుపునివ్వడంతో వైసీపీ అధినేతపై టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అయితే జగన్ ను శిశుపాలుడితో పోల్చడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్ వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. పవిత్రమైన తిరుమలలో, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల మీద అన్యమత ప్రచారం చేసిన పాపం మీదే అని, తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం మీదే అని, తిరుమలను వ్యాపార కేంద్రంగా చేసిన పాపం మీదే అని, లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి ఉపయోగించిన పాపం మీదే అని, ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై మండిపడ్డారు.

జగన్, శశిపాలుడిలా మీరు చేసిన నూరు తప్పులు పూర్తి అయ్యాయని, ఇప్పటికైనా ఆ భగవంతుడిని క్షమించమని చేసిన తప్పులు ఆ దేవుడి ముందు ఒప్పుకుని చెంపలు వేసుకోవాలని, అలా చేస్తే మీరు చేసిన తప్పులకు కొంచెం అయినా పరిహారం చిక్కుతుందని, అలా కాకుండా ఇప్పుడు కూడా దేవుడి ముందు రాజకీయాలు చెయ్యాలని ప్రయత్నిస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అత్యంత దారుణంగా శ్రీవారి లడ్డూలు తయారు చేసిన మీ పాపం పండిపోయిందని, ఆ పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టవని మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ శనివారం తిరుమల వెలుతానని ఇప్పటికే ప్రకటించారు.
జగన్ తిరుమల పర్యటన సందర్బంలోనే శనివారం వైసీపీ నాయకులు వారివారి ఊర్లలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చెయ్యాలని వైసీపీ హైకమాండ్ ఆ పార్టీ నాయకులకు సూచించింది. ఈ సందర్బంలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చేైసిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు కూడా ఎదురు దాడి చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications