కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్ వెనుక కారణమిదే, అయినా, టిఆర్ఎస్‌కు నష్టమే: రఘువీరా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎన్డీయే నుండి టిడిపి బయటకు వస్తోందనే ఉద్దేశ్యంతోనే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్ అంటూ కొత్త పల్లవిని అందుకొన్నారని ఎపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ ఓటమిపాలయ్యే అవకాశం ఉందన్నారు. థర్ట్ ఫ్రంట్‌ను కెసిఆర్‌ ఏర్పాటు చేసినా నిలదొక్కుకోవడం కష్టమని రఘువీరారెడ్డి చెప్పారు.

Andhra pradesh pcc chief Raghuveera Reddy on Kcr's Third front

ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించారని రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాపై టిడిపికి చిత్తశుద్ది ఉంటే రాజ్యసభ ఎన్నికలను బహిస్కరించాలని రఘువీరారెడ్డి చంద్రబాబునాయుడును కోరారు.

ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను దక్కించుకోవాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh pcc president N. Raghuveera Reddy made allegations on TRS chief KCR on Sunday at Vijayawada. He spoke to media at Vijayawada party office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి