Andhra Pradesh :చివరి విడత బడ్జెట్ కింద భారీగా నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ద్వారా రూ.12,843 కోట్ల భారీ నిధులను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి విడత బడ్జెట్ కింద ఈ నిధులను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
మంగళగిరిలోని ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ( Andhra Pradesh Health, Medical & Family Welfare Department) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వీరపాండియన్ గురువారం జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విడుదలైన నిధులను నిర్ణీత గడువులోగా అంటే వచ్చే నెల (ఫిబ్రవరి) 20వ తేదీ నాటికి ఖర్చు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఖర్చు చేసిన వివరాలను వెంటనే నివేదికల రూపంలో సమర్పించాలని కోరారు.

Andhra Pradesh జిల్లాల వారీగా నిధుల కేటాయింపు ఇలా..
ఈ విడత నిధుల్లో కొన్ని జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో భారీగా కేటాయింపులు జరిగాయి. గుంటూరు జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 2,061 కోట్లు కేటాయించారు. నెల్లూరు జిల్లాకు రూ.8.60 కోట్లు విడుదలయ్యాయి. కృష్ణా జిల్లాకు రూ. 6.21 కోట్లు కేటాయించారు. మిగిలిన జిల్లాలకు వాటి అవసరాలను బట్టి గరిష్టంగా రూ. 5.20 కోట్ల నుండి కనిష్టంగా రూ. 2 కోట్ల వరకు నిధులను పంపినట్లు కమిషనర్ తెలిపారు.
ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలనే దానిపై కమిషనర్ వీరపాండియన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. NHM నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రతి పైసా ఖర్చు చేయాలని సూచించారు. నిధుల వినియోగంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పారదర్శకత పాటించాలని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) బలోపేతం, మందుల కొనుగోలు, కుటుంబ సంక్షేమ పథకాల అమలుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఈ నిధుల విడుదల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో ఉన్నందున, ఈ నిధులను సకాలంలో ఖర్చు చేయడం ద్వారా వచ్చే ఏడాదికి మరిన్ని నిధులు పొందేందుకు అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications