Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rowdy: ఆంధ్రా రౌడీ మీద బెంగళూరులో కాల్పులు, బుల్లెట్ల వర్షం, వెంటాడి వచ్చిన ప్రత్యర్థులు, జస్ట్ ? !

బెంగళూరు/మదనపల్లె: అపార్ట్ మెంట్ నిర్మిస్తున్న ఓ రౌడీషీటర్ అతని కారు డ్రైవర్ తో కలిసి అక్కడికి వెళ్లాడు. అపార్ట్ మెంట్ నిర్మాణం పనులు పరిశీలిస్తున్నారు. అదే సందర్బంలో రెండు బైక్ ల్లో హెల్మెట్లు పెట్టుకుని వెళ్లిన వ్యక్తులు రౌడీషీటర్, అతని కారు డ్రైవర్ మీద కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన ప్రత్యర్థులు బైక్ ల్లో పరారైనారు. రౌడీషీటర్ తో పాటు కారు డ్రైవర్ కు బుల్లెట్ గాయాలు కావడంతో కుప్పకూలిపోయారు. అపార్ట్ మెంట్ పనులు చేస్తున్న కూలీలు బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రౌడీషీటర్ ను అంతం చెయ్యడానికి అదే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యర్థులు వచ్చారని విచారణలో తెలిసిందని బెంగళూరు పోలీసులు చెప్పారు.

మదనపల్లె రౌడీషీటర్

మదనపల్లె రౌడీషీటర్

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలోని కురబలకోటకు చెందిన శివశంకర్ రెడ్డి అలియాస్ శివారెడ్డి (31) అనే వ్యక్తి మీద హత్యలు, హత్యాయత్నాలతో పాటు పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అంటున్నారు. మదనపల్లె రౌడీషీటర్ల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు ఉందని బెంగళూరు పోలీసులు చెప్పారు.

బెంగళూరులో అపార్ట్ మెంట్ నిర్మాణం

బెంగళూరులో అపార్ట్ మెంట్ నిర్మాణం

బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలోని సోన్నేనహళ్లిలోని హ్యాపీగార్డెన్ లేఔట్ లో రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి అపార్ట్ మెంట్ నిర్మిస్తున్ననాడు. గురువారం మద్యాహ్నం శివశంకర్ రెడ్డి, అతని కారు డ్రైవర్ అశోక్ రెడ్డి (34) కలిసి కేఆర్ పురం సమీపంలోని సీగేనహళ్లిలోని హ్యాపీగార్డెన్ లోని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లారు.

రివాల్వర్ లతో కాల్పులు

రివాల్వర్ లతో కాల్పులు

రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి, అతని కారు డ్రైవర్ అశోక్ రెడ్డి అపార్ట్ మెంట్ నిర్మాణం పనులు పరిశీలిస్తున్నారు. అదే సందర్బంలో రెండు బైక్ ల్లో హెల్మెట్లు పెట్టుకుని వెళ్లిన నలుగురు వ్యక్తులు రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి, అతని కారు డ్రైవర్ అశోక్ రెడ్డిల మీద కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన ప్రత్యర్థులు బైక్ ల్లో హ్యాపీగార్డెన్ లేఔట్ నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు.

జస్ట్ మిస్ అయ్యింది

జస్ట్ మిస్ అయ్యింది

రౌడీషీటర్ శివశంకర్ రెడ్డితో పాటు కారు డ్రైవర్ అశోక్ రెడ్డికి బుల్లెట్ గాయాలు కావడంతో కుప్పకూలిపోయారు. అపార్ట్ మెంట్ పనులు చేస్తున్న కూలీలు బెంగళూరులోని కేఆర్ పురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివశంకర్ రెడ్డి, అశోక్ రెడ్డిలను కేఆర్ పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి తరువాత మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

మదనపల్లె నుంచి వచ్చిన ప్రత్యర్థులు

మదనపల్లె నుంచి వచ్చిన ప్రత్యర్థులు

రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి, అశోక్ రెడ్డి గురువారం మద్యాహ్నం మదనపల్లె నుంచి బెంగళూరు వచ్చారని కేఆర్ పురం పోలీసులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెకు చెందిన రౌడీషీటర్ శివశంకర్ రెడ్డిని అంతం చెయ్యడానికి అదే మదనపల్లె నుంచి అతని ప్రత్యర్థులు వచ్చారని ప్రాథమిక విచారణలో తెలిసిందని బెంగళూరులోని కేఆర్ పురం పోలీసులు చెప్పారు.

రౌడీషీటర్ మీద అనేక కేసులు పెండింగ్

రౌడీషీటర్ మీద అనేక కేసులు పెండింగ్

గతంలో బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో రౌడీషీటర్ శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించామని కేఆఱ్ పురం పోలీసులు అన్నారు. రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి మీద మదనపల్లెలో హత్యలు, హత్యాయత్నాలతో పాటు అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేఆర్ పురం పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యేకి అనుచరుడు ?

ఎమ్మెల్యేకి అనుచరుడు ?

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమ్మ జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి రౌడీషీటర్ శివశంకర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది, కాల్పులు జరిపిన వారిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+