ఏపీ సంక్రాంతి కానుక.. కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదల
సంక్రాంతి వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన వైద్యారోగ్య శాఖకు సంబంధించి భారీగా నిధులు విడుదల చేసింది. ఇక దేశంలో ఆరోగ్య రంగానికి రాష్ట్రాల వారీగా కేటాయించబడిన 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్థి స్థాయిలో సాధించిన ఘనత కూడా రాష్ట్రానికి దక్కింది. ఈ నిధులను రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, గ్రామీణ-పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
గత 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి కేటాయించిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంటును పూర్తిస్థాయిలో సాధించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐదో, చివరి విడతగా రూ.567.40 కోట్లను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

వైద్య మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
15వ ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే 1,467 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 సామాజిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో నిలిచిపోయిన లేదా ఆలస్యమైన నిర్మాణ పనులకు వేగం తీసుకొచ్చిన ఫలితంగానే కేంద్రం నుంచి చివరి విడత నిధులు విడుదలయ్యాయని మంత్రి తెలిపారు.
నిధుల వినియోగంలో మెరుగైన పనితీరు
2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి రాష్ట్రానికి రావాల్సిన రూ.2,600 కోట్లలో ఇప్పటివరకు రూ.2,033 కోట్లు విడుదల కాగా, అందులో రూ.1,896 కోట్లను ఇప్పటికే ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం విడుదలైన నిధుల్లో 43 శాతం కూటమి ప్రభుత్వ హయాంలోనే రావడం గమనార్హం. అలాగే ఖర్చులోనూ దాదాపు సగం నిధులు గత 19 నెలల్లోనే వినియోగించామని వెల్లడించారు.
ఎలా ఖర్చు చేయనున్నారు?
సోమవారం విడుదలైన రూ.567.40 కోట్లలో రూ.233.45 కోట్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి కేటాయించారు. రూ.218.11 కోట్లు డయాగ్నస్టిక్ సేవల అభివృద్ధికి, రూ.55.89 కోట్లు గ్రామీణ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు, రూ.52.71 కోట్లు పట్టణ ప్రాంత ఆరోగ్య సేవల విస్తరణకు కేటాయించారు.
కేంద్రంతో సమన్వయం ఫలితం
మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం సాయంత్రం నిర్వహించిన 2025-26 బడ్జెట్ సమీక్ష సమావేశం ముగిసిన కొద్ది సేపటికే కేంద్రం నుంచి చివరి విడత నిధులు విడుదల కావడం విశేషంగా మారింది. ఇది వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వం చేసిన సమన్వయ ప్రయత్నాలకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రతి రూపాయిని ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
-
‘ఇళ్లు లేని పేదవాడు’ ఉండకూడదు. 2029 నాటికి 17 లక్షల గృహాలు -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications