22 సార్లు చంద్రబాబు పేరు: ఫోన్ ట్యాపింగ్‌పై ఎపి దూకుడు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులపై దూకుడు ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరును 22 సార్లు ప్రస్తావించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత దూకుడుగా వ్యవహరించాలని ఎపి పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నమోదు చేసిన 87 ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసుల ప్రతులను తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి అందించారు.

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన విషయాలను భద్రపరచాలని ఆదేశిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నోటీసులనే ఎపి పోలీసులు తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి అందించారు. ఇదిలావుంటే, నోటుకు ఓటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్యకు బెదిరింపులు వచ్చిన ఆరోపణలకు సంబంధించి తెలంగాణ మంత్రి కెటి రామారావు డ్రైవర్, గన్‌మన్ ఆచూకీని ఎపి పోలీసులు కనిపెట్టలేకపోయారు.
దాంతో వారి అచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధికారులు మరోసారి ఆ నోటీసులను అందించే ప్రయత్నంలో ఉన్నారు. వారికి నోటీసులు అందించేందుకు సహకరించాలని వారు తెలంగాణ నిఘా విభాగం అధికారులను కోరారు. అయితే, వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసే ఉద్దేశంతో వారున్నారు.












Click it and Unblock the Notifications