అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా బాధ్యత బీజేపీదే: కాంగ్రెస్, రేపటినుండి బదలీలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి ఉద్యోగుల బదిలీలకు తెర లేవనుంది. జూన్ 5 వరకూ కొనసాగనున్న ఈ ఉద్యోగ బదిలీల వ్యవహారాన్ని జిల్లా స్ధాయి కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేయనున్నారు. గత ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈసారి తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

Andhra Pradesh staff to get transfers from tomorrow

దీంతో పాటు ఉద్యోగుల బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పలు కీలక అంశాలను పొందుపరుస్తారని తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : షకీల్‌ అహ్మద్‌

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి ఎన్డీఏ కూడా మద్దతు ప్రకటించిందని ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి షకీల్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక హోదాపై ఎంతకాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన చెప్పారు.

English summary
Andhra Pradesh staff to get transfers from tomorrow onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X