వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఎఫెక్ట్: ఏపీ బిజెపి నేతలకు ఢిల్లీకి పిలుపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్డీఏ నుండి టిడిపి బయటకు రావడంతో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను చర్చించేందుకుగాను ఏపీకి చెందిన బిజెపి నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఢిల్లీకి రావాలని సమాచారాన్ని పంపింది.

ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో పొందుపర్చిన అన్ని అంశాలను అమలు చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.

కేంద్రం నుండి సరైన స్పందన లేకపోవడంతో తొలుత కేంద్రప్రభుత్వం నుండి మంత్రులు వైదోలిగారు. శుక్రవారం నాడు ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది.మొత్తంగా ఏపీలో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.

బిజెపి నేతలకు ఢిల్లీకి పిలుపు

బిజెపి నేతలకు ఢిల్లీకి పిలుపు

ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం శుక్రవారం నాడు సమాచారాన్ని పంపింది. ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వెళ్ళడంతో పాటు ప్రత్యేక హోదా అంశంతో పాటు ఇతర అంశాలు కూడ చర్చకు వచ్చే అవకాశం ఉందని బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టిడిపి, బిజెపిల మధ్య 2014 ఎన్నికల సమయంలో పొత్తు ఉంది. ఈ పొత్తుతో కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉంది. ఏపీ రాష్ట్రంలో బిజెపి భాగస్వామిగి ఉంది. కానీ, ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఈ రెండు పార్టీలు బయటకు వచ్చాయి.

టిడిపి విషయం

టిడిపి విషయం

ఏపీ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయంపై బిజెపి నేతలతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఏపీ నేతలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తే రాజకీయంగా బిజెపికి ప్రయోజనం ఉంటుందనే అంశంపై బిజెపి నాయకత్వం చర్చించే అవకాశం ఉంది.

టిడిపితో పొత్తును కోరుకొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం

టిడిపితో పొత్తును కోరుకొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం

టిడిపితో పొత్తును బిజెపికి చెందిన రాష్ట్ర నాయకుల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది ఏపీ రాష్ట్ర పర్యటనకు అమిత్‌ షా వచ్చిన సమయంలో టిడిపితో పొత్తును తెగదెంపులు చేసుకోవాలని కొందరు నాయకులు కోరారు. ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. స్వతహగా తమ పార్టీ బలోపేతం కావడానికి టిడిపి అవరోధంగా ఉందని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.అయితే టిడిపితో పొత్తు తెంచుకొన్న నేపథ్యంలో తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని బిజెపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

2019లో బిజెపి పొత్తు ఎవరితో

2019లో బిజెపి పొత్తు ఎవరితో

2019 ఎన్నికల సమయంలో బిజెపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకొంటుందనే విషయమై ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బిజెపితో టిడిపి పొత్తును తెగదెంపులు చేసుకొంది. అయితే 2019 ఎన్నికల్లో బిజెపి ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొంటుందా, ఒంటరిగా పోటీ చేస్తోందా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వామపక్షాలతో కలిసి పోరుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతిస్తామని ఇప్పటికే వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పొత్తులపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Andhra Pradesh state BJP leaders called to Delhi by the party chief Amit shah on Friday. The tdp moved a no-confidence motion against the government in the Lok Sabha today,After Tdp's decision Bjp chief called Ap bjp leaders called to delhi by the party chief amitshah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X