ఏపీ బడ్జెట్ ఏటా పెరుగుతోంది, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న యనమల!
అమరావతి: 2019 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంబో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 2018-19కి గాను రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశముంది. గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీంతో తాయిలాలకూ, సంక్షేమానికి పెద్దపీట వేయనున్నారు. జలవనరులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు, ఉపాధికి, పింఛన్లకు పెద్ద మొత్తాలు ప్రతిపాదించనున్నారు.

2014-15లో 1,11,824 కోట్ల అంచనాతో సమర్పించిన బడ్జెట్ క్రమంగా ప్రతి ఏటా వేల కోట్లు పెరుగుతోంది. ఇప్పుడు రూ.2 లక్షల కోట్లకు చేరనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications