వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుజ్జగించడం అయిపోయింది.. ఇక ఆ అస్త్రమే?: మోడీకి బాబు లొంగిపోతారా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రెండు మిత్రపక్షాల మధ్య అగాథం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తమపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న టీడీపికి ఎలా సర్దిచెప్పాలో బీజేపీకి అర్థం కావడం లేదు. అయితే బుజ్జగించడం ద్వారానో నచ్చజెప్పడం ద్వారానో టీడీపీ లొంగిపోయే పరిస్థితి లేదు గనుక.. కాస్త కఠినంగానే వ్యవహారించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ బీజేపీ నేతల్ని రంగంలోకి దించుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Union Budget 2018: TDP MPs Hold Black Ribbon Protest
ఏం చేయబోతున్నారు

ఏం చేయబోతున్నారు

ఏపీ ప్రజల ముందు తమను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న టీడీపికి గట్టిగా బుద్ది చెప్పాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇందుకోసం నేడు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రెస్‌మీట్‌లో కేంద్రం నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి అందిన నిధుల చిట్టాను బయటపెడుతారట. అదే సమయంలో ఆ లెక్కల్లో జరిగిన గోల్ మాల్ గురించి కూడా ప్రశ్నిస్తారని తెలుస్తోంది.

 ఉపేక్షించేది లేదని.

ఉపేక్షించేది లేదని.

ఇచ్చిన నిధులకే సరైన లెక్క చెప్పలేని చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం తమను చిన్న చూపు చూస్తుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అన్న ప్రశ్నను ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు జనం ముందు పెట్టబోతున్నారట. తాడో పేడో తేల్చుకుంటామని టీడీపీ మాట్లాడుతుంటే.. తాము మాత్రం ఇంకా ఎందుకు ఉపేక్షించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 అదే జరిగితే..

అదే జరిగితే..

ఒకవేళ నిజంగానే ఏపీ బీజేపీ నేతలు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను బయటపెట్టి.. చంద్రబాబును వివరణ కోరితే ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. ఇప్పటివరకు ఇచ్చిన నిధులపై లెక్క చెప్పలేకనే టీడీపీ నీళ్లు నమలుతున్న పరిస్థితి. కాబట్టి బీజేపీ ప్రయోగించబోతున్న ఈ అస్త్రాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

కొనసాగిస్తారా?.. లేక లొంగిపోతారా?..

కొనసాగిస్తారా?.. లేక లొంగిపోతారా?..

కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు పెద్ద ఎత్తున్నే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రజల్లో టీడీపీ ప్రయత్నాల పట్ల కాస్త నమ్మకం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో బీజేపీ చంద్రబాబు ప్రభుత్వ లొసుగుల్ని బయటకు లాగితే.. టీడీపీకి బిగ్ డ్యామేజ్ తప్పదనే చెప్పాలి. మరి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు దేనికైనా సిద్దమేనని ఈ పోరాటాన్ని కొనసాగిస్తారా?.. లేక మోడీ ప్రయోగించే సామ దాన భేద దండోపాయలకు జంకి లొంగిపోతారా? అన్నది వేచి చూడాలి.

English summary
Reports saying that AP BJP leaders are going to Delhi on Saturday. They are going to conduct a press meet to question CM Chandrababu on central funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X