కేంద్రం తీరు నిరసిస్తూ విజయవాడలో ధర్నా చెయ్యాలని చంద్రబాబు సంచలన నిర్ణయం .. నిరసన అందుకేనట

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకా ఎన్నికల ప్రచారానికి పట్టుమని 6 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో ప్రచారంలో జోరు పెంచిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ, ఆయన నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు జరుగుతున్నాయి . మొన్నటికి మొన్న రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి కి చెందిన 315 కోట్ల విలువ గల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అంతే కాకుండా టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులతో పాటు నారాయణ విద్యా సంస్థల్లో , రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు . వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుంటూ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

Andhrapradesh CM Chandrababu naidu sit on protest in vijayawada against it raids on TDP candidates

ఈ నేపధ్యంలోనే కేంద్ర సంస్థల దాడులకు నిరసనగా ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకునారు చంద్రబాబు నాయుడు . కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ తమపై దాడులకు యత్నిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్రలో భాగంగా కేంద్ర సంస్థలను రంగంలోకి దింపింది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈసీ కూడా కేంద్రానికి తగ్గట్టుగా పని చేస్తుందని ఆరోపిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+