అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవనిర్మాణదీక్ష:నేతలను పరిగెత్తిస్తున్న చంద్రబాబు

మూడేళ్ళలో మనం సాధించిన అభివృద్దిని ప్రజలకు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, మంత్రులకు సూచించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: మూడేళ్ళలో మనం సాధించిన అభివృద్దిని ప్రజలకు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, మంత్రులకు సూచించారు.రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను మూడేళ్ళలో సాధించిన అభివృద్దిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని బాబు సూచించారు.

జూన్ రెండవతేదని నవనిర్మాణ దీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ దీక్ష సందర్భంగా మూడేళ్ళలో సాధించిన అభివృద్దిని వివరించాలని ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు సూచించారు.

నవనిర్మాణదీక్షపై చంద్రబాబునాయుడు మంత్రులు, పార్టీ నాయకులతో టెలికాన్పరెన్స్ ను నిర్వహించారు. వారం రోజుల పాటు నవనిర్మాణదీక్షను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అయితే వారంరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని బాబు చెప్పారు. జిల్లా, నియోజకవర్గస్థాయిలో జరిగే కార్యక్రమాలను విశ్లేషించనున్నట్టు బాబు ప్రకటించారు.

మూడేళ్ళలో ఏం సాధించామో ప్రజలకు వివరించాలి

మూడేళ్ళలో ఏం సాధించామో ప్రజలకు వివరించాలి

2014 లో అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు. ప్రాంతాలవారీడా జరిగిన అభివృద్దిని స్థానికులకు అర్ధమయ్యేలా చెప్పాలన్నారు. వారం రోజుల పాటు నవనిర్మాణదీక్ష, మహాసంకల్పదీక్షలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నాయకులను కోరారు.

ప్రజలను సంతృప్తే కొలమానం

ప్రజలను సంతృప్తే కొలమానం

మూడేళ్ళలో రాష్ట్రంలో ఏం జరిగింది...ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయం ప్రధానమన్నారు. ప్రజలు సంతృప్తే కొలమానమన్నారు చంద్రబాబునాయుడు. ఎన్నికార్యక్రమాలు, పథకాలు చేపట్టినా ప్రజలు సంతృప్తిగా లేకపోతే వృధాయేనని చెప్పారు. అయితే మూడేళ్ళలో ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందిన లబ్దిదారులతో ఆయా సభల్లో మాట్లాడించాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.లబ్దిదారుల మాటలు ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏడాదికో సంకల్పం

ఏడాదికో సంకల్పం

ప్రతి ఏటా ఒక్క సంకల్పాన్ని తీసుకొని, దాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని బాబుచెప్పారు.ఈ గత ఏడాది అందరికీ విద్యుత్ ను సంకల్పంగా పెట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఈ సంకల్పాన్ని సాధించేందుకుగాను ప్రయత్నించామన్నారుర. ఈ ఏడాది అందరికీ వంటగ్యాస్ అనే సంకల్పాన్ని తీసుకొంటామని చెప్పారు. వచ్చే ఏడాది మరో సంకల్పాన్ని తీసుకోనున్నట్టు చెప్పారు బాబు.

ఆర్థికలోటు అయినా కష్టమే

ఆర్థికలోటు అయినా కష్టమే

ఆర్థికలోటు అయినా అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. కష్టాలను అధిగమించడం చాలా కష్టంగా ఉందన్నారు. అందరిలో స్పూర్తిని నింపేందుకుగాను నవనిర్మాణ దీక్ష, మహాసంకల్ప దీక్షను చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2న, నవనిర్మాణ దీక్ష, 3న, విభజన చట్టం, 4న, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలు, సలసంరక్షణ, నధుల అనుసంధానం, నీరు ప్రగతి, పంటకుంటలు, రుణ ఉపశమనం, సుస్థిర అభివృద్ది వ్యూహంపై చర్చ జరుగుతోందన్నారు.5న, సంక్షేమం, సమ్మిళిత అభివృద్ది, 6న, మానవనరుల అభివృద్ది, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ , ఉద్యోగ కల్పన, 7న, ప్రజలే ముందు, సమాజ వికాసం, అవార్డులు, విజయాలపై చర్చకార్యక్రమాలను నిర్వహించాలని బాబు సూచించారు.

English summary
Andhrapradesh government planning to conduct seven days programme on Nava Nirmana deeksha from june 2 to 7.Ap chiefminister Chandrababu naidu teleconference with ministers and party leaders on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X