Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెడకు ఉరితాళ్ళతో అంగన్వాడీల ఆందోళన; జగన్ సర్కార్ తో ప్రచ్చన్నయుద్ధం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని అంగన్వాడి కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. అంగన్వాడీల ఆందోళన విరమింపజేయటం కోసం ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదు.

మంత్రి బొత్సా సత్యన్నారాయణ చర్చలు జరిపి మరికొంత సమయం ఇస్తే ఆలోచిస్తామని చెప్పారు. దీనికి అంగన్వాడీలు ససేమిరా అన్నారు. ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైసిపి ఇన్చార్జిల నివాసాలను ముట్టడిస్తున్నారు. అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పింఛన్ అమలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Anganwadis protest with hangings to their necks; war with Jagan govt!!

తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడుతున్నారు. 26 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇంతగా ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్టడి చేస్తున్న అంగన్వాడీలు, తాజాగా రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి కార్యకర్తలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ వినూత్న నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో అంగన్వాడీలు మెడకు చీరలను ఉరి తాళ్లుగా బిగించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం అంగన్వాడీల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ ఇచ్చిన మాట మేరకు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+