అమరావతిలో చంద్రబాబును కలిసిన అనిల్ అంబానీ
అమరావతి: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
Recommended Video

అమరావతిలో అంబాని! ఏం జరుగుతుంది???
సచివాలయంలో ఈ భేటీ జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పవర్ ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

అంతకుముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు.












Click it and Unblock the Notifications