తగ్గేదేలే...కొడాలినాని - నాది ఒకటే లక్ష్యం : నాకు ఎవరూ పోటీ కాదు : పవన్ కళ్యాణ్ కు అనిల్ సవాల్..!!
మాజీ మంత్రి అనిల్ కుమార్ తన లక్ష్యం స్పష్టం చేసారు. తాను ఏం చేయబోతున్నదీ తేల్చి చెప్పారు. మంత్రులుగా పదవులు తీసేసిన తనతో పాటుగా కొడాలి నాని - పేర్ని నాని - కన్నబాబుది ఒకటే లక్ష్యంతో పని చేస్తామన్నారు. మంత్రిగా ఉండటం కంటే..జగన్ సైనికుడిగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పారు. ఇక, చంద్రబాబు - పవన్ కళ్యాన్ కు ఛాలెంజ్ చేసారు. ఎవరైనా సరే..దమ్ముంటే జగన్ పైన ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పాలని సవాల్ చేసారు. పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ భీమ్లా నాయక్ కాదని..బిచ్చం నాయక్ అంటూ ఫైర్ అయ్యారు.

పవన్ పై అప్పుడు వ్యాఖ్యలు వెనక్కు..
పవన్..ఒంటరిగా
140
సీట్లలో
పోటీ
చేసి
తానే
సీఎం
అభ్యర్ధినని
చెప్పగలిగే
తాను
అంటున్న
బిచ్చం
నాయక్
అనే
మాటలు
వెనక్కు
తీసుకుంటానని
సవాల్
చేసారు.
చంద్రబాబు
వేసే
ముష్టి
కోసం..ఆ
30-40
సీట్ల
కోసం
పవ్
ప్రయత్నం
చేస్తున్నారని
మండి
పడ్డారు.
వాళ్లందరూ
కలిసి
కట్టుగా
వచ్చినా..విడివిడిగా
వచ్చినా
2024లో
జగన్
మరోసారి
సీఎం
అని
ధీమా
వ్యక్తం
చేసారు.
ఈ
జన్మకు
జగన్
కు
రుణ
పడి
ఉంటానని
స్పష్టం
చేసారు.
రాజు
యుద్దానికి
వెళ్లే
ముందు
తాను
నమ్మిన
సైన్యాన్ని
ముందు
పంపిస్తారని..అదే
విధంగా
ఇప్పుడు
తమను
జగన్
పంపారని
చెప్పుకొచ్చారు.
తన
వయసు
ఇంకా
42
ఏళ్లేనని..మళ్లీ
మళ్లీ
ఎమ్మెల్యేగా
-
మంత్రిగా
జగన్
వద్ద
పని
చేస్తానని
చెప్పారు.
తనకు
ఏమైనా
60
ఏళ్ల
వయసు
ఉందా..మరోసారి
మంత్రి
కానని
బాధ
పడాల్సిన
అవసరం
ఉందా
అంటూ
ప్రశ్నించారు.

ఇక ప్రతీ నిమిషం పార్టీ కార్యకర్తలతోనే
మూడేళ్ల నుంచి కార్యకర్తలతో సరిగ్గా కలిసే అవకాశం రాలేదని..ఇక, రేపటి నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటానని అనిల్ ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి ప్రతీ గడపకు వెళ్తానని వెల్లడించారు. నెల్లూరులో టీడీపీ కంచుకోటల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసామని చెప్పుకొచ్చారు. ఈ సభ తాను వైసీపీ కార్యకర్తలతో పెట్టుకున్న సభ అంటూ..ఆదివారం ట్రాఫిక్ ఉండదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసానని వివరించారు. తాను ఎవరికీ పోటీ కాదని..తనకు తానే పోటీ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. 2024 లో జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని..తాను మంత్రి అవ్వటమూ ఖాయమన్నారు. నెల్లూరు జిల్లాలో వర్గాలు లేవన్నారు. ఉన్నది ఒకటే వర్గమని..అది జగన్ వర్గమని వ్యాఖ్యానించారు. ఎవరైనా జగన్ బొమ్మతోనే గెలవాలని స్పష్టం చేసారు.

ఎవరైనా జగన్ బొమ్మతోనే గెలవాలి
వ్యక్తిగతంగా తమకు మూడు - నాలుగు వేల ఓట్లు మాత్రమే వస్తాయని..ఎవరైనా జగన్ బొమ్మ పెట్టుకుంటేనే ఎమ్మెల్యే అయ్యేదని చెప్పుకొచ్చారు. తాను సభ ఏర్పాటు చేస్తే..ఉత్కంఠ అని.. ఏం మాట్లాడుతారో అని..ఏదేదో ప్రచారం చేసారని..కానీ, తాను మాత్రం జగన్ సైనికుడినని..తన రక్తంలోనూ జగన్నామస్మరణ మాత్రమే ఉంటుందంటూ అనిల్ తన ప్రసంగంలో కార్యకర్తల్లో జోష్ పెంచే ప్రయత్నం చేసారు. ఎక్కడా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ప్రస్తావించని అనిల్...మంత్రి పదవి పోవటంతో తాము రెండింతల శక్తి వంతుల మని..మంత్రిగా కొన్ని గౌరవాలు పాటించాలని..ఇప్పుడు డబుల్ స్పీడ్ తో పని చేస్తామని అనిల్ ప్రకటించారు.