ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!

APSRTC పై భారం పెరుగుతోంది. ఒక వైపు ఇంధన పొదుపు పైన అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే పెరిగిన డీజిల్ ఛార్జీలు.. ఉచిత బస్సు పథకం సంస్థ పైన భారం పెంచుతున్నాయి. పెరిగిన డీజిల్ ధరల భారంతో సామాన్యులు ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో స్త్రీ శక్తి పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల పైన పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగటం లేదు. దీంతో.. ఆర్టీసీకి మోయలేని భారంగా మారుతోంది.

పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆర్టీసీ భారంగా మారుతున్నాయి. దీని ద్వారా రోజుకు అదనంగా రూ.25 లక్షల వ్యయాన్ని భరించాల్సిన భారాన్ని ఎదుర్కొంటోంది. నెలకు రూ.7.5 కోట్లుగానూ సంవత్సరానికి రూ.90 కోట్లుగా ఉంది. RTC బస్సులు ఏపీలో రోజుకు సుమారు 40 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తాయి. సగటున RTC బస్సులు లీటరు డీజిల్‌కు 5.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. RTC ప్రతిరోజూ దాదాపు 7.7 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఆర్టీసీకి లీటరుకు రూ.4 వరకు తక్కువ ధరకు అంటే రాయితీ రేటుకే దీనికి డీజిల్ అందిస్తున్నారు. అయితే, పెరిగిన ధరలు కేవలం రిటైల్ బల్క్ అమ్మకాల పైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో, ఆర్టీసీ నిత్యం వినియోగించే 7.70 లక్షల లీటర్ల డీజిల్ ధర లీటరుకు రూ.3.30 చొప్పున పెరగడంతోదాదాపు రూ.25 లక్షల అదనపు ఆర్థిక భారం పడింది.

TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
apsrtc-under-financial-pressure-amid-diesel-price-hike-and-free-bus-scheme-here-the-details

నష్టం భర్తీ పై అధికారు కసరత్తు

అటు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు చర్యల వేళ.. ఆర్టీసీకి మాత్రం భారం తప్పటం లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉచిత బస్సు పథకం అయిదు కేటగిరీల బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఈ టికెట్ల విలువకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం రీ యంబర్స్ చేస్తుంది. ఈ పథకం కింద చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.260 కోట్ల నుంచి రూ.270 కోట్ల మధ్య ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.160 కోట్లను మాత్రమే సమకూరుస్తోంది. ఈ ఆర్థిక భారం నేరుగా RTC సంస్థపై పడదు. అయినప్పటికీ డీజిల్ ధరల ఇటీవల పెంపు కారణంగా ప్రజా రవాణా శాఖ ఇప్పుడు అదనపు ఆర్థిక భారాన్ని స్వయంగా భరించాల్సి వస్తోంది. అయితే, ఛార్జీల పెంపు అవకాశం ఇప్పటికిప్పుడు కనిపించటం లేదు. చిన్న మొత్తంలో పెంచినా ఉపయోగం లేదని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో పెంచేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు. ఉచిత బస్సు ప్రయాణం అమలు వేళ 40 శాతం మంది ప్రయాణీకులు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో.. డీజిల్ ధరల పెంపు.. సంస్థ పైన భారం వేళ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మార్గాల పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+