Avore EX Bike: సింగిల్ ఛార్జ్‌తో 260 కిమీ రేంజ్: కేవలం రూ.799లకే ప్రీ-బుకింగ్.. ఇంత చౌకా!!

Avore EX Bike: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మార్కెట్లో కొద్దిమంది మాన్యుఫాక్చరర్స్ మాత్రమే ఎలక్ట్రిక్ బైకులను విక్రయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత మార్కెట్లో ఓ కొత్త ఈవీ బ్రాండ్ ప్రవేశించింది. అదే మరేదో కాదు.. గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్ 'అవోర్'(Avore). ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ బైకులను ఆవిష్కరించింది.

ఈ బ్రాండ్ EX1, EX2, EX2S అనే మూడు మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. అన్ని మోడల్ బైకులు ప్రీ-బుకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటి డిజైన్ ప్రాథమికంగా ఒకేలా ఉన్నప్పటికీ.. బ్యాటరీ లైఫ్, రేంజ్, వేగం, ఫీచర్లలో అవి విభిన్నంగా ఉంటాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Avore EX Bike Launched in India Offers 260 km Range at Just Rs 799 Pre-Booking and 114 km h top Speed

*ఈ బైక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ అవోర్ EX1. ఇది 3.24kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ 160 కిలోమీటర్లు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ బైక్ ధర రూ.1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్).

*ఈ బ్రాండ్ అవోర్ EX2లో పెద్ద బ్యాటరీని అందించింది. ఈ బైక్ 5kWh బ్యాటరీతో వస్తుంది, ఇది 255 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా కలిగి ఉంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ బైక్ బ్యాటరీ సుమారు రెండు గంటల్లో 20 శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీనిని సాధారణ 15A సాకెట్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఈ వెర్షన్ ధర రూ.1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్).

*టాప్ మోడల్‌లో ఏమేమి లభిస్తాయంటే?
ఈ బ్రాండ్ టాప్ వేరియంట్ అవోర్ EX2S, దీని ధర రూ.1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కూడా 5kWh బ్యాటరీతో వస్తుంది, కానీ దీని గరిష్ట వేగం 114 కి.మీ/గం. ఈ వేరియంట్ 260 కి.మీల రేంజ్‌ను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఇది ఐదు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ బైక్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. కంపెనీ ఇంకా బైక్ పూర్తి స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. ఈ బైక్‌లను కేవలం రూ.799కే ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై బ్రాండ్ ఎటువంటి సమాచారం అందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+