మంత్రి కాకానికి రెండింతలు తిరిగిస్తా - దాచుకొనే అలవాటు లేదు : డబుల్ ఫోర్స్ తో -అనిల్ సంచలనం..!!

వైసీపీ నెల్లూరు ఫైర్ బ్రాండ్..మాజీ మంత్రి అనిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ - పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడే అనిల్..ఇప్పుడు జిల్లా నుంచి కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఏపీలో మంత్రివర్గ విస్తరణతో అధికార పార్టీలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.

పదవులు రాని సీనియర్లు... తిరిగి అవకాశం దక్కని మాజీ మంత్రులు కొందరు అలకబూనారు. మరి కొందరు సీనియర్లు అనుచరులు నిరసనలకు దిగారు. ఒక్కక్కొరుగా సీఎం పిలిని మాట్లాడుతుండటంతో...వారు తమకు అసలు పదవుల మీద వ్యామోహం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి కొంత డిఫరెంట్ గా కనిపిస్తోంది.

అనిల్ వ్యాఖ్యలతో బిగ్ డిబేట్

అనిల్ వ్యాఖ్యలతో బిగ్ డిబేట్

అక్కడ మాజీ మంత్రి అనిల్ కు తిరిగి కేబినెట్ లో స్థానం దక్కలేదు. అదే సమయంలో కొత్త మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి అనిల్ హాజరు కాలేదు. ఈ సమయంలో అనిల్ దీని పైన స్పష్టత ఇచ్చారు. తనకు కాకాణి గోవర్ధన్ రెడ్డి నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదు అన్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి రాలేకపోయానన్నారు.

అను ఆరోగ్య పరీక్షల కోసం చెన్నైకు వెళ్లానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెల్లూరు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. అనిల్ వ్యంగాస్త్రాలు వెనుక ఉద్దేశం ఏంటనే దాని పైన చర్చ సాగుతోంది. తాను మంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో తన పైన చూపిన ప్రేమ .. అభిమానం.. వాల్సల్యం సహకారానికి రెండింతలు ఇస్తానంటూ వ్యాఖ్యానించారు.

రెండింతలు తిరిగి ఇస్తా.. ఉంచుకోనంటూ

రెండింతలు తిరిగి ఇస్తా.. ఉంచుకోనంటూ

ఇచ్చింది ఉంచుకోవటం తనకు ఉంచుకొనే అలవాటు లేదని చెప్పటం ద్వారా అనిల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం జిల్లా రాజకీయాలు తెలిసిన వారందరికీ స్పష్టత వచ్చింది. అవసరమైతే కొత్త మంత్రిని తన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఆహ్వానిస్తానని స్పష్టం చేసారు. జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరణకు సిద్దమేనని స్పష్టం చేసారు.

కొందరు మంత్రులను తప్పించటం పైన ప్రతిపక్షాలు సంబర పడుతున్నాయని.. పదవులు లేకపోయినా డబుల్ ఫోర్స్ తో రెచ్చిపోతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ కోసం దేనికైనా తామంతా సిద్దంగా ఉన్నామని అనిల్ స్పష్టం చేసారు. అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డితో కొన్ని అంశాల పైన కోల్డ్ వార్ నడిచింది.

నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది...

నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది...

తాను ఇప్పుడు మంత్రిగా లేకున్నా..తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని..మంత్రి అవుతామని జగన్ చెప్పారని అనిల్ వెల్లడించారు. వైసీపీ ఒక కుటుంబం వంటిదని... ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు. అనిల్ తాజా వ్యాఖ్యలతో నెల్లూరు అధికార పార్టీలో రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ మొదలైంది.

గతంలో నేతల మధ్య విభేదాల పరిష్కారానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల జిల్లా నేతలందరితోనూ సమావేశం ఏర్పాటు చేసారు. కానీ, నేతల మధ్య మాత్రం ప్రఛ్చన్న పోరాటం కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి మంత్రి కావటంతో..కొత్త అధ్యక్షుడు నియామకం జరుగుతుందని చెబుతున్నారు. దీంతో..నెల్లూరు వైసీపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+