వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎంల ఆందోళన

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో ఏఎన్ఎంల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగుల నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా మారుమోగింది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో కూడా ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఏఎన్ఎంలు నిరసన బాట పట్టారు. ఉద్యోగ భద్రత కోసం రోడ్డుమీదికొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉద్యోగాలను క్రమబద్దీకరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతితోపాటు జిల్లాల్లో డీఎంహెచ్వో కార్యాలయాలను ముట్టడించారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

anms agitation about employement

శ్రీకాకుళం, గుంటూరులో డీఎంహెచ్‌వో కార్యాలయాల వద్ పోలీసులకు, ఏఎన్ఎంలకు తోపులాట జరిగింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళన బాట పట్టిన ఏఎన్ఎంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల్లో కూడా వారిని స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మరోవైపు తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఏఎన్ఎంలు మండిపడ్డారు. తమకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానం సరికాదని హెచ్చరిస్తున్నారు.

English summary
The ANMs ’concern in AP has led to tension. Tension has been raised by police blocking a protest to provide job security. Amidst slogans of employees demanding that their demands be met throughout the region. On the other hand, ANMs have also raised concerns in the district centers. However, they were blocked by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X