వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగిసిన క్యాంటీన్లకు తాళాలు పడుతున్నాయి. వాటి కాంట్రాక్టు గడువును పొడిగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపట్లేదు. అన్నా క్యాంటీన్లకు ప్రత్యామ్నాయంగా మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించే ఏర్పాట్లను చేస్తోందని, ఇందులో భాగంగానే- వాటి కాంట్రాక్టును రెన్యూవల్ చేయట్లేదని తెలుస్తోంది. మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రానున్నాయనగా.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయిదు రూపాయలకు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో వాటిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కాకుండా.. దశలవారీగా నెలకొల్పారు.

 ఆగస్టు 1 డెడ్ లైన్

ఆగస్టు 1 డెడ్ లైన్

ఏడాదికేడాది ఆయా క్యాంటీన్ల నిర్వాహకుల కాంట్రాక్టును స్థానిక మున్సిపల్ అధికారులు రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు గడువు ముగిసిన ఏ క్యాంటీన్ నిర్వహణకు కూాడా ప్రభుత్వం పచ్చజెండా ఊపలేదు. నిర్వాహకుల బిల్లులను చెల్లించట్లేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం 70 కోట్ల రూపాయలకు పైగా చేరుకుందని తెలుస్తోంది. రెండు నెలల బకాయిలు అందాల్సి ఉందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడం, కాంట్రాక్టు గడువును పొడిగించడానికి మున్సిపల్ అధికారులు ఆసక్తి చూపకపోవడం వల్ల అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. ఆగస్టు 1 నాటికి దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తవచ్చిన అంటున్నారు.

జైపాల్ రెడ్డి పాడె మోస్తూ, పిల్లాడిలా విలపించిన మాజీ స్పీకర్ రమేష్ కుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య! <br /> జైపాల్ రెడ్డి పాడె మోస్తూ, పిల్లాడిలా విలపించిన మాజీ స్పీకర్ రమేష్ కుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య!

మూసివేతకు సిద్ధంగా ఉన్న క్యాంటీన్లు..

మూసివేతకు సిద్ధంగా ఉన్న క్యాంటీన్లు..

చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో తొలిదశలో పలు క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి చాలా క్యాంటీన్లు ఇక తెరచుకోకపోవచ్చని తెలుస్తోంది. చాలా క్యాంటీన్లు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధర్యంలో నడుస్తున్నాయి. క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని అక్షయపాత్ర సొంతంగా తెప్పించుకుని, భోజనాన్ని సరఫరా చేస్తుంటుంది. దీనికి సంబంధించిన ఖర్చులు, ఇతర బిల్లులను స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి తీసుకుంటుంది. కొంతకాలంగా సకాలంలో బిల్లులు అందకపోవడం వల్ల భోజనంలో పదార్థాలను తగ్గించేశారు క్యాంటీన్ నిర్వాహకులు. బిల్లులు చెల్లించకపోవడం, కాంట్రాక్టు గడవును పొడిగించడానికి అధికారులు విముఖత చూపిస్తున్న నేపథ్యంలో- ఇక మొత్తానికే ఎత్తేయవచ్చని అంటున్నారు. మూసివేతకు సంబంధించినంత వరకు స్థానిక అధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు అందాయని అక్షయపాత్ర ప్రతినిధులు చెబుతున్నారు. లిఖితపూరకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని, అయినప్పటికీ.. కాంట్రాక్టును రెన్యూవల్ చేయనిదే.. వాటిని నిర్వహించలేమని అక్షయపాత్ర ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

70 కోట్లకు పైగా బకాయిలు..

70 కోట్లకు పైగా బకాయిలు..

ఒక్కో జిల్లాలో 10 నుంచి 25 వరకు అన్నా క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. జిల్లా విస్తీర్ణాన్ని బట్టి వాటి సంఖ్యను పొడిగించారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో 30కి పైగా క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో సుమారు 20 వరకు క్యాంటీన్లు విశాఖపట్నం పరిధిలోనే ఉన్నాయి. వాటి నిర్వహణకు సుమారు 15 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలను అన్నా క్యాంటీన్ల కోసం విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడం వల్ల ఇక వాటి నిర్వహణ భారంగా మారిందని అంటున్నారు అక్షయపాత్ర ప్రతినిధులు. రెండు నెలల నుంచీ బిల్లులు అందట్లేదని అంటున్నారు. అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారా? లేక మూసివేస్తారా? అనేది కూడా స్పష్టంగా తెలియట్లేదని చెబుతున్నారు.

Recommended Video

విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని నా కల - సీఎం జగన్
ప్రత్యామ్నాయం కోసమేనా?

ప్రత్యామ్నాయం కోసమేనా?

ఇదిలావుండగా- అన్నా క్యాంటీన్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదివరకు అయిదు రూపాయలకు భోజనాన్ని అందిస్తుండగా.. ఈ ధరను నాలుగు రూపాయలకే కుదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదివరకు పసుపులో ఉన్న అన్న క్యాంటీన్ల రంగును ప్రభుత్వం మారిన తరువాత మార్చేశారు. తెలుపురంగులోకి తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్ల పేర్లను రాజన్న క్యాంటీన్లుగా మార్చారు. ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లను కొనసాగిస్తూ.. ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఇదివరకు ప్రభుత్వం భావించినప్పటికీ.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా- అన్నా క్యాంటీన్లు మూతపడటం దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.

English summary
Are Anna Canteens, one of the pet projects of the former Chief Minister N. Chandrababu Naidu, being closed? Sources say the present service provider Hare Krishna Charitable Foundation, that runs the Akshaya Patra midday meal scheme and to whom the cooking and supply of food has been outsourced, has been asked to supply the last meal on July 31 night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X