• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కొత్తజిల్లాల ప్రకటన; వైసీపీ పక్కదారి పట్టించే గేమ్‌; రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు ఉన్న జిల్లాలను 26 జిల్లాలుగా మారిస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం కూడా లేకపోలేదని, రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చ.

ఏపీ 13 జిల్లాలను 26 జిల్లాలుగా... జగన్ అకస్మాత్ నిర్ణయం

ఏపీ 13 జిల్లాలను 26 జిల్లాలుగా... జగన్ అకస్మాత్ నిర్ణయం

2014 రాష్ట్ర విభజన తర్వాత ఇంతకాలానికి ఏపీ 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడం 26 జిల్లాల భౌగోళిక వివరాలను వెల్లడిస్తూ, వాటిమీద ప్రజల అభిప్రాయాలను తెలియజేయాలని ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రజలు నెలరోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదలవుతుంది. ఇక ప్రజాభిప్రాయాలను స్వీకరించి రాజకీయ ఒత్తిళ్లు, నిరసనలు, అభ్యర్థనలు వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని మళ్లీ జిల్లాల రూపురేఖలు మారితే మారవచ్చు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై సమాధానం చెప్పలేక పక్కదారి పట్టించే మైండ్ గేమ్

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై సమాధానం చెప్పలేక పక్కదారి పట్టించే మైండ్ గేమ్

ఇదిలా ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుక మతలబు ఏమైఉంటుంది అని ప్రతిపక్ష పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.రాష్ట్రంలో ఉన్న సమస్యలపై సమాధానం చెప్పలేక, ఇది కేవలం పక్కదారి పట్టించే మైండ్ గేమ్ అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఒకపక్క రాష్ట్రంలో పిఆర్సి కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు గుడివాడ క్యాసినో వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తూ జగన్ సర్కార్ కు ఊపిరాడని ఇవ్వడం లేదు.

మంత్రివర్గంలో కొత్త జిల్లాలపైన జరగని చర్చ.. హడావిడిగా రాత్రికి రాత్రే ఆమోదం

మంత్రివర్గంలో కొత్త జిల్లాలపైన జరగని చర్చ.. హడావిడిగా రాత్రికి రాత్రే ఆమోదం

ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై పెరిగిన అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించలేని విధంగా తయారయ్యాయి. ఈ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన కేవలం రాష్ట్రంలో ఉన్న సమస్యల నుండి, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడినుండి తప్పించుకునే యత్నం అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
జనవరి 21వ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగినా అందులో కొత్త జిల్లాల ప్రకటనపై కనీసం చర్చ జరగలేదు. ఆ తర్వాత హడావుడిగా 25వ తేదీ రాత్రి మంత్రులకు నోట్ పంపి కొత్త జిల్లాల విషయంలో ఆమోదం పొందారంటే జగన్ ఆలోచన అర్ధం అవుతుందని అంటున్నారు.

 జిల్లాల ఏర్పాటు ప్రకటనతో పక్కకు పోయిన ఏపీ సమస్యలు

జిల్లాల ఏర్పాటు ప్రకటనతో పక్కకు పోయిన ఏపీ సమస్యలు

జిల్లాల ఏర్పాటు ప్రకటన చేసినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు పక్కకు వెళ్లి పోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయమే ప్రధానమైన అంశంగా మారింది. ఇక అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని పలు జిల్లాలలో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు, ప్రజలు రోడ్డు మీదకు వచ్చి చేస్తున్న నిరసనలు వెరసి ప్రస్తుతం చర్చ అంతా కొత్త జిల్లాల ఏర్పాటు అన్నట్టు సాగుతుంది. జిల్లాల ఏర్పాటు నిర్ణయంపైనే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి వైసిపి వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ కొంత మేరకు సక్సెస్ అయింది అనే చెప్పాలి.

వైసీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్న ప్రతీసారి తెరమీదకు కొత్త వ్యవహారం

వైసీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్న ప్రతీసారి తెరమీదకు కొత్త వ్యవహారం


వైసీపీని ఇరకాటంలో పెట్టే ఏ అంశం దొరికినా దానిని గట్టిగా వాడుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయత్నం చేస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రతి సమయంలోనూ వైసిపి పక్కదారి పట్టించే మైండ్ గేమ్ తో ఒక కొత్త వ్యవహారం తెరమీదకు తెచ్చి ఆ సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తుంది అనేది రాజకీయ వర్గాల భావన. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి కొంత కాలం పాటు ప్రజల దృష్టిని మరల్చే అవకాశం లేకపోలేదు.

English summary
Every time a new affair comes to the screen when the opposition trying to pressurize YSRCP. There is an interesting debate going on in political circles that the ysrcp govt announcement of new districts in the AP is a game of subsiding serious issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X