ఆ చారిత్రాత్మక ఆలయ ప్రత్యేకత అదే..!!
Ram Navmi at Vontimitta temple: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 78,496 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,046 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.60 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. నేటి నుండి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరంగా పిలుస్తారు. శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఉదయం 9:30 నుండి 10:15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు సర్వ దేవతలనూ ఆహ్వానిస్తారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. 7వ తేదీన ఉదయం వేణుగాణ అలంకారంలో కటాక్షిస్తాడు. రాత్రి- హంస వాహన సేవ ఉంటుంది.
8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహ వాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 10వ తేదీన ఉదయం మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తాడు. రాత్రి గరుడసేవ ఉంటుంది. 11వ తేదీన ఉదయం శివధనుర్బాణ అలంకరణ, రాత్రి- కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
12వ తేదీన ఉదయం కన్నులపండువగా రథోత్సవం. 13న ఉదయం కాళీయమర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహనంపై సీతాసమేత కోదండరాముడు భక్తులను కరుణిస్తాడు. 14వ తేదీన ఉదయం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రాత్రి ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు. 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు అర్చకులు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. కడప ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుంటారు చంద్రబాబు. కల్యాణోత్సవంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications