IRCTC నుంచి అదిరిపోయే ప్యాకేజ్
ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తోంది. తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అందుబాటులోకి వచ్చింది. మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేష్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఇది కవర్ చేయబోతోంది. జూన్ 10న యాత్ర ప్రారంభం కానుంది. ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ.
సికింద్రాబాద్ లో అర్ధరాత్రి 12.10 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. యాత్రకు వెళ్లేవారు కాజీపేట్, పెద్దపల్లి , రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్‌షా, వార్ధా, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లలో కూడా ఈ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. మొదటి రోజంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండోరోజు ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ చూస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది. మూడోరోజు మథుర, కృష్ణ జన్మభూమి, ప్రేమ్ మందిర్, బన్కే బీహారీ ఆలయం చూడొచ్చు. అక్కడి నుంచి మాతా వైష్ణోదేవి బయల్దేరాలి. నాలుగో రోజు మాతా వైష్ణోదేవి కాట్రా చేరుకున్న తర్వాత దర్శనం కోసం రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నడక, పోనీ, డోలీతోపాటు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే హెలికాప్టర్ కావాలనుకునే పర్యాటకులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐదో రోజు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుంచి హరిద్వార్ బయలుదేరి ఆరో రోజు హరిద్వార్ చేరుకుంటారు. మానస దేవీ, గంగా హారతి దర్శనం అనంతరం రాత్రికి హరిద్వార్‌లో బస ఉంటుంది. ఏడో రోజు రిషికేష్ చేరుకుంటారు. నిమిదో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. తొమ్మిదో రోజు స్వస్థలానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.15,435 కాగా, స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.24,735గా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications