మరో భర్త హత్య: బావతో సంబంధం, కలవడానికి వీలవట్లేదని భర్తకు విషమిచ్చి చంపింది

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: మొన్న మహబూబ్ నగర్‌లో స్వాతి, నిన్న యాదాద్రి నల్గొండ జిల్లాలో జ్యోతి.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో భర్తను చంపిన మరో సంఘటన వెలుగు చూసింది. నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపింది.

ఈ ఘటనలో నిందితుడు గొట్టిపాటి వీరయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బావతో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చి భార్యనే చంపేయడం గమనార్హం. వివాహేతర సంబంధం కారణంగా భర్తలను చంపుతున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.

భర్త హత్య, ప్రియుడితో సంబంధం: 'ప్లాన్ అంతా భార్యదే, ఆ వీడియోలు చూపించేది'

బావతో కలిసి భర్తను చంపిన భార్య

బావతో కలిసి భర్తను చంపిన భార్య

గుంటూరు జిల్లాకు చెందిన నరేంద్రచంద్ర, శ్రీవిద్యలు భార్యాభర్తలు. భర్త గత నెల విగతజీవిడిగా కాల్వలో కనిపించాడు. దీనిని అనుమానాస్పద హత్య కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. దర్యాఫ్తులో భార్యనే బావతో కలిసి చంపినట్లుగా గుర్తించారు.

సుఖంలేక టెక్కీ భర్త హత్య: ప్రియుడితో వెళ్లాలని చంపేశా.. జ్యోతి, స్వాతిని చూశాకేనా?

ముందే వివాహేతర సంబంధం

ముందే వివాహేతర సంబంధం

శ్రీవిద్యకు బావ అయ్యే వీరయ్యతో పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదని, మాట్లాడటానికి వీలుపడటం లేదని శ్రీవిద్య భావించేదని తెలుస్తోంది. భర్త నరేంద్ర అడ్డుగా ఉండటంతో అతనిని చంపాలని నిర్ణయించుకుంది.

బావను కలిసేందుకు సమయం దొరకట్లేదని

బావను కలిసేందుకు సమయం దొరకట్లేదని

బావను కలిసేందుకు సాయం దొరకడం లేదని, అతని సాయంతోనే భర్తను హత్య చేసేందుకు ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా భర్తకు మద్యంలో విషం లేదా సైనెడ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మృతి చెందిన అనంతరం కాల్వలో పడేశారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, పరారీలో శ్రీవిద్య

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, పరారీలో శ్రీవిద్య

భర్త పేరిచర్లలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాత కాల్వలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు లోతుగా విచారణ జరపడంతో భార్యనే నిందితురాలు అని తేలింది. ప్రస్తుతం శ్రీవిద్య పరారీలో ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Another case of planned murder of a husband by the wife in Guntur district. Wife Sri Vidya on absconding.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి