బియాస్ విషాదం: నదిలో మరో మృతదేహం వెలికితీత
సిమ్లా/హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో శుక్రవారం మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. హైదరాబాద్ ఏఎస్ రావునగర్‌కు చెందిన సాయిరాజ్ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, తల్లిదండ్రులతో పోట్లాడి మరీ విహారయాత్రకు వెళ్లిన సాయిరాజ్, చివరకు శవమై లభించాడన్న వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

గురువారం వెలికితీసిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. మాచర్ల అఖిల్, ఆశీష్ మంథా, శివప్రకాశ్ వర్మల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమారులు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
విహారయాత్రకు వెళ్లి బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గల్లంతైన మిగితా 11 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications