నా నిర్ణయం కూడా అదే, వైసీపీని వీడటంపై తేల్చేసిన మరో ఎంపీ
వైఎస్ఆర్సీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. రాజ్యసభకు రేపు (శనివారం) రాజీనామా చేయాలని సాయిరెడ్డి నిర్ణయించారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయసాయిరెడ్డి బాటలోనే మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. రాజ్యసభ సభ్యుడు ఆయోధ్య రామిరెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి, ఆయోధ్య రామిరెడ్డి సన్నిహితులు కావడంతో , ఆయన కూడా రాజీనామా చేస్తున్నారని అంతా భావించారు.

తాజాగా తన రాజీనామాపై ఆయోధ్య రామిరెడ్డి స్పందించారు.తన రాజీనామాపై వస్తోన్న వార్తలను అయోధ్య రామిరెడ్డి ఖండించారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని ఇండియాకు రాగానే నేరుగా మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు తెలియజేస్తానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications