హోం మంత్రి అనిత ఇలాకాలో మరో కొత్త ఎయిర్పోర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ గా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఏపీ రాష్ట్రానికి రెక్కలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య కేంద్రాలలో కొత్త విమానాశ్రయాలకు కీలక అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించగా, మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిటికి భూసేకరణ టెండర్లు మరికొన్నింటికి సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. మొదట కాకినాడ జిల్లాలోని అన్నవరం తుని మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, రైతులు వ్యతిరేకించడంతో పాటు సాంకేతిక సమస్యల వల్ల ఆ ప్లాన్ లో మార్పు వచ్చింది.

అక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి డీపీఆర్
ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నక్కపల్లి మధ్యలో గోపాలపట్నం వద్ద ఎయిర్పోర్టును నిర్మించాలని భావించినా, ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. అయితే ఇటీవల మళ్ళీ ఎయిర్పోర్ట్స్ పైన జరిగిన చర్చలో తుని అన్నవరం మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన డి పి ఆర్ సిద్ధమవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
కాకినాడ సమీపంలో ఎయిర్ పోర్ట్ అవసరం ఇందుకే
కాకినాడ తో పాటు ఉప్పాడ అనకాపల్లిలోని నక్కపల్లి లో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్న కారణంగా ఎయిర్పోర్ట్ అవసరం ఉందని, ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలర్ మిట్టల్, ఎన్టిపిసి వంటి పరిశ్రమలు ఇక్కడికి రావడంతో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కాకినాడ జిల్లాలోని విమానాశ్రయం ఏర్పాటు చేయడం అవసరమని భావించి ఈ క్రమంలో దీని పైన దృష్టి సారిస్తున్నారు.
పాయకరావుపేట సమీపంలోనే ఎయిర్పోర్ట్ వస్తుందా?
తునికి వంద కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. గతంలో ఈ భూములు అనుకూలం పోవడంతో తుని ప్రతిపాదన రద్దయింది. ఇప్పుడు పాయకరావుపేట సమీపంలో నిర్మాణం పైన తిరిగి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. అదే గనుక జరిగితే మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటవుతుంది.
హోం మంత్రి ఇలాకాలో ఎయిర్ పోర్ట్.. సందిగ్ధానికి త్వరలోనే తెర
ఈ కొత్త ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వం హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర ఏర్పాటు చేస్తారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటు విశాఖపట్నం రాజమహేంద్రవరం కు మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం ఆయన పాయకరావుపేట దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు జరుగుతుందా? లేదా అన్న సందిగ్దానికి త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications