స్కూళ్ల రీ ఓపెన్ పై అమావాస్య ఎఫెక్ట్, వాయిదా..!!

వేసవి సెలవులు ముగిసాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన బడులు ఈ నెల 15 (ఈరోజు) నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ రోజు ప్రారంభం పైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాఠశాలలు మొదలైనా... విద్యార్ధుల హాజరు పై మాత్రం అమావాస్య ప్రభావం కనిపించింది. దీంతో.. పలు ప్రయివేటు పాఠశాలలు 17వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించాయి. విద్యార్ధుల పేరెంట్స్ సైతం మంచి రోజు నుంచి తమ పిల్లలను బడులకు పంపించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులుగా ముగియటంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. కాగా, అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరయ్యారు. కొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరవ్వగా..పలు పాఠశాలలకు విద్యార్ధుల హాజరు నామ మాత్రంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్‌లోని బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు హజరు కావటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తరగతి గదుల్లో ఒకరిద్దరు మినహా పెద్దగా హాజరు శాతం కనిపించటం లేదు.

బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!
బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!
amavasya-timing-of-telangana-school-reopening-triggers-public-objections-here-the-details

హాజరు శాతం తక్కువ

పిల్లల విషయంలో సెంటిమెంట్ గా భావించి ఈ పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో బడులకు పంపలేదు. అమావాస్య రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న (బుధవారం), 19న (శుక్రవారం) ప్రారంభించేందుకు నిర్ణయించాయి. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్ తో పాటుగా బ్యాగ్స్.. పుస్తకాలతో ఇచ్చే కిట్స్ సైతం సిద్దం చేసింది. అయితే.. అమావాస్య సెంటిమెంట్ తో తల్లితండ్రులు తమ పిల్లలను బడికి దూరంగా ఉంచటంతో.. పలు పాఠశాలలు ప్రారంభం అయినా హాజరు కనిపించ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+