ఎపిలో మరో కొత్త ప్రయోగం?...అన్నిసంక్షేమశాఖలకూ ఒకే ముఖ్యకార్యదర్శి
అమరావతి:సంక్షేమ శాఖలకు ముఖ్య కార్యదర్శుల నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ముఖ్య కార్యదర్శుల నియామకాల్లో ఇప్పటి వరకు అవలంభిస్తున్న విధానానికి భిన్నంగా ఒక నూతన విధానాన్ని అమల్లోకి తేవాలని ఎపి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఒక్కో సంక్షేమ శాఖకు ఒక్కో ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుండగా ఇక పై ఆ విధానానికి స్వస్తి పలకనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
దీంతో ఒక సంక్షేమ శాఖకు ఒక ముఖ్య కార్యదర్శి విధానానికి ముగింపు పలికి అన్ని సంక్షేమ శాఖలకు కలిపి ఒకే ఒక కార్యదర్శిని నియమించాలని ఎపి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా ఈ విధానం అమలులోకి రానున్నట్లు గుసగుసలు వినిపిస్తుండటంతో ఈ విషయమై వివిధ శాఖల అధికారులు చర్చించుకుంటుండటంతో బైటకి పొక్కినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువమంది ఉన్నతాధికారులు ఈ విధానంపై పెదవి విరుస్తున్నట్లు సమాచారం. కారణం...
సంక్షేమ శాఖ లంటేనే ఆయా వర్గాల ప్రజల సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చెయ్యడంతో పాటు, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఒక్కో శాఖకు ఒక్కో ముఖ్య కార్యదర్శి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని మెజారిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారట. పైగా ప్రభుత్వం ఉన్నట్టుండి సంక్షేమ శాఖలకు సంబంధించి ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవాలని ఎందుకు యోచిస్తుందో అధికారులే బిన్నరకాలుగా చర్చించుకుంటున్నారట.












Click it and Unblock the Notifications